Collector Son: అంగన్ వాడీ స్కూల్ లో కర్నూల్ కలెక్టర్ కొడుకు.. రోల్ మోడల్ గా నిలిచిన కోటేశ్వరరావు

Collector Son: ప్రస్తుతం విద్యావ్యవస్థ మొత్తం కార్పొరేట్ సంస్థల చుట్టు తిరుగుతోంది. మధ్యతరగతి, పేద ప్రజలు సైతం తమ పిల్లలను కార్పొరేట్ స్కూళ్లకు పంపిస్తున్నారు. తమ స్థోమతకు మించి లక్షలాది రూపాయలు వెచ్చించి పిల్లలకు చదువులు చెప్పిస్తున్నారు.కాని ఓ జిల్లా కలెక్టర్ మాత్రం తమ పిల్లాడిని ప్రభుత్వ స్కూల్ లో జాయిన్ చేయించి అందరికి ఆదర్శంగా నిలిచారు.

Written by - Srisailam | Last Updated : Jun 4, 2022, 07:41 AM IST
  • అంగన్ వాడీ స్కూల్ లో కలెక్టర్ కొడుకు
  • ఆదర్శంగా నిలిచిన కర్నూల్ జిల్లా కలెక్టర్
  • కలెక్టర్ కోటేశ్వరరావుపై ప్రశంసల జల్లు
Collector Son: అంగన్ వాడీ స్కూల్ లో కర్నూల్ కలెక్టర్ కొడుకు.. రోల్ మోడల్ గా నిలిచిన కోటేశ్వరరావు

Collector Son: ప్రస్తుతం విద్యావ్యవస్థ మొత్తం కార్పొరేట్ సంస్థల చుట్టు తిరుగుతోంది. మధ్యతరగతి, పేద ప్రజలు సైతం తమ పిల్లలను కార్పొరేట్ స్కూళ్లకు పంపిస్తున్నారు. తమ స్థోమతకు మించి లక్షలాది రూపాయలు వెచ్చించి పిల్లలకు చదువులు చెప్పిస్తున్నారు. పిల్లల చదువు కోసం అప్పులు చేయడానికి కూడా వెనుకాడటం లేదు. విద్య కోసం ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా.. జనాలకు అందుబాటులోనే స్కూళ్లు ఉంటున్నా జనాలు పట్టించుకోవడం లేదు. ఇక ఉన్నతవర్గాలు, ఉద్యోగస్తులు అయితే అత్యంత ఖరీదైన స్కూళ్లను వెతికి తమ పిల్లలను అడ్మిట్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ స్కూల్స్ కోసం సుదూర ప్రాంతాలకు కూడా పంపిస్తున్నారు. చిన్నస్థాయి ఉద్యోగులు కూడా కార్పొరేట్ స్కూళ్ల బాట పడుతున్నారు. కాని ఓ జిల్లా కలెక్టర్ మాత్రం తమ పిల్లాడిని ప్రభుత్వ స్కూల్ లో జాయిన్ చేయించి అందరికి ఆదర్శంగా నిలిచారు.

కర్నూలు జిల్లా కలెక్టర్ తన కొడుకును అంగన్ వాడీ స్కూల్ లో చేర్పించారు. కర్నూలు కలెక్టర్ కోటేశ్వరరావుకు ఒకడే కొడుకు. పేరు దివి ఆర్విన్. అతని మూడేళ్లు రావడంతో ప్లే స్కూల్ కు పంపించాలని కలెక్టర్ నిర్ణయించారు. అయితే ప్రైవేట్ ప్లే స్కూల్స్ కు పంపకుండా.. తమ సమీపంలోని అంగన్ వాడీ స్కూల్ లో జాయిన్ చేయించారు. కలెక్టర్ బంగ్లాకు సమీపంలోని బుధవార పేటలో అంగన్ వాడీ స్కూల్ ఉంది. దీంతో తన కొడుకు దివి ఆర్విన్ ను కలెక్టర్ కోటేశ్వరరావే స్వయంగా తీసుకెళ్లి అక్కడ అడ్మిట్ చేశారు. కలెక్టర్ కొడుకు అంగన్వాడీ సెంటర్ లోని ఇతర పిల్లలతో కలిసి ఎంజాయ్ చేశారు.  రంగులు దిద్దుకుంటూ, ఆట వస్తువులతో సంతోషంగా ఆడుకుంటున్నాడు.

కలెక్టర్ కోటేశ్వరారవు ఇటీవలే విద్యాశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యా విధానంలో ప్రభుత్వం తీసుకొచ్చిన సమూలమైన మార్పులపై చర్చించిన కలెక్టర్.. అంగన్ వాడి కేంద్రాలలో అందుతున్న సదుపాయాలు, సౌకర్యాల తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారట. అందులో వాస్తవం ఉందో లేదో తెలుసుకోవాలని స్వయంగా తన కొడుకునే అక్కడ జాయిన్ చేసినట్లు జిల్లా అధికారులు చెబుతున్నారు. అంగన్ వాడీ కేంద్రాల్లో  ప్రభుత్వం కల్పించిన వసతులు బాగున్నాయని ప్రజలకు తెలిసేలా చేసేందుకు కలెక్టర్..  తన కుమారుడినే బ్రాండ్ అంబాసిడర్ గా చేశారని కర్నూల్ జిల్లా విద్యాశాఖ అధికారులు అంటున్నారు.

సామాన్యుడిలా తన కొడుకును అంగన్ వాడీ కేంద్రంలో అడ్మిట్ చేసిన కలెక్టర్ కోటేశ్వరరావుపై అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. ప్రభుత్వ ఏర్పాటను ప్రజలు ఉపయోగించుకోవాలని జిల్లా కలెక్టర్ సందేశం ఇచ్చారని కొనియాడుతున్నారు. కోటేశ్వరరావుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రభుత్వం అధికారులు, రాజకీయ నాయకులు కర్నూల్ జిల్లా కలెక్టర్ ను ఆదర్శంగా తీసుకోవాలని కామెంట్లు పెడుతున్నారు.

READ ALSO: MLC Anantha Babu: జైల్లో తోటి ఖైదీపై దాడి చేసిన ఎమ్మెల్సీ అనంత బాబు...?  

READ ALSO: Gangrape: బాలిక గ్యాంగ్ రేప్ ఘటనలో గంటకో ట్విస్ట్.. నిందితుల్లో హోంమంత్రి మనవడు? క్లారిటీ ఇచ్చిన డీసీపీ...  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు,హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News