Anam Ramnarayana Reddy: ఆనం రామనారాయణ రెడ్డి.. ఏపీలో సీనియర్ రాజకీయ నేత. గతంలో నెల్లూరు జిల్లా రాజకీయాలను శాసించారు. వైఎస్సాఆర్ హయాంలో మంత్రిగా ఓ వెలుగు వెలిగిన ఆనం రామనారాయణ రెడ్డి.. ప్రస్తుతం వెంకటగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. జగన్ కేబినెట్ లో చోటు దక్కుతుందని భావించినా ఆయన అవకాశం రాలేదు. దీంతో ఆయన వైసీపీలో అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం సాగుతోంది. కొంత కాలంగా ఓపెన్ గానే ఆనం తన అసమ్మతిని బయటపెడుతున్నారు. జగన్ ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తున్నారు. ఎమ్మెల్యే ఆనం కామెంట్లు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతున్నాయి. తాజాగా మరోసారి ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు ఆనం రామనారాయణ రెడ్డి.
నెల్లూరు నగరంలోని దర్గామిట్ట పోలీస్‌స్టేషన్ దగ్గర ఎమ్మెల్యే ఆనం హల్చల్ చేశారు. పోలీసులతో గొడవకు దిగారు. స్థానిక వేణుగోపాలస్వామి ఆలయ భూముల్లో అక్రమాలు జరిగాయని కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఆలయ సిబ్బందిని పోలీసులు విచారణ కోసం పిలిచారు. ఈ విషయం తెలిసిన ఎమ్మెల్యే ఆనం కోపంతో ఊగిపోయారు. పోలీస్ స్టేషన్ కు వచ్చా తన ప్రతాపం చూపించారు. ఆలయ సిబ్బందిని పోలీస్ స్టేషన్ కు పిలవడంపై తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. ఏం విచారణ చేస్తున్నారని నిలదీశారు. ఎవరో ఫిర్యాదు చేసే నిజానిజాలు తెలుసుకోకుండానే విచారణ కోసం ఎలా పిలుస్తారంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐ తీరుపై ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. పోలీసుల ముందే సీఐ పని తీరు బాగా లేదంటూ మండిపడ్డారు. ఇదేం పద్ధతంటూ ఉన్నతాధికారులను నిలదీశారు.
పోలీసులతో పాటు ప్రభుత్వం తీరుపైనా ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నెల్లూరులో ఇలాంటి దాడులు పెరిగిపోయాయని ఆరోపించారు. భయపెట్టి భూములను ఆక్రమించుకోవడం, భవనాలను లాక్కోవడం కామన్ గా మారిపోయిందన్నారు ఆనం.ప్రజలే కళ్లు తెరిచి తిరగబడాలని పిలుపిచ్చారు. నెల్లూరులో జరిగే అక్రమాలు, దుర్మార్గాలపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు చెప్పారు. పోలీసుల హామీతో ఈ గొడవను ఇంతటితో వదిలేస్తున్నామని చెప్పారు. అయితే పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్యే ఆనం చేసిన కామెంట్లు రచ్చగా మారాయి. ప్రజలే తిరగబడాలని చెప్పడం ద్వారా పరోక్షంగా సీఎం జగన్ పై తాను తిరుగబాటు చేశాననే సంకేతం ఆనం ఇచ్చారనే టాక్ నడుస్తోంది.గతంలోనూ పలు సార్లు జగన్ ను టార్గెట్ చేసేలా మాట్లాడారు ఆనం.నెల్లూరులో జరిగిన ఘటన వైసీపీలో కలవరం రేపుతోంది. పార్టీలో కొంత కాలంగా అసంతృప్తిగా ఉన్న ఆనం రామనారాయణ రెడ్డి.. తన దారి చూసుకోవాలనే నిర్ణయానికి వచ్చారనే ప్రచారం సాగుతోంది.
Read also: Munugode Bypoll: మునుగోడు ఓటర్లకు బిగ్ షాక్? ఉప ఎన్నికలో సంచలనం జరగబోతోందా..?
Read also: Python in Khammam: గ్రామంలోకి భారీ కొండచిలువ.. పరుగులు తీసిన జనాలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook