Pawan Kalyan Delhi Elections Campaign:కేంద్ర నాయకులు అట్లాగే ఢిల్లీలో ఉన్నతెలుగు ప్రజలందరూ కూడా మహారాష్ట్రకి ఎన్నికలు ప్రచారం చేసినట్టుగా పవన్ కళ్యాణ్ ఢిల్లీలో కూడా ప్రచారం చేస్తారంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. అంతేకాదు బీజేపీ నేతలు కూడా ఢిల్లీలో పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారంటూ స్టేట్మెంట్స్ ఇచ్చారు. మరోవైపు ఢిల్లీలో తెలుగు ప్రజలు పవన్ కళ్యాణ్ ప్రచారం కోసం ఎదురుచూశారు. ఆఖరి నిమిషంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు తప్ప పవన్ కళ్యాణ్ ప్రచారానికి వెళ్ళలేదు.
పవన్ కళ్యాణ్ పుంగునూరులో జనసేన సభ జరిగిన కూడా దానికి హాజరు కాలేదు. అక్కడ జనసేన తరుపున నాగేంద్ర బాబు వెళ్లారు. పవన్ కళ్యాణ్ జనసేన తరఫున బొలిశెట్టి సత్యనారాయణ ఢిల్లీలో మీడియా ప్రెస్ మీట్ ని ఉద్దేశించి మాట్లాడారు. ప్రెస్ మీట్ లో జనసేన ఎన్డిఏ కూటమికి మద్దతు తెలుపుతుంది అంటూ కూడా అందరూ బిజెపి కి ఓటు వేయాలి లేదా ఎన్డిఏ కి ఓటు వేయాలి అంటూ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారా తప్ప ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావించలేదు. పవన్ కళ్యాణ్ రోడ్ షోలు కూడా ఉంటాయి అన్నారు అన్నీ కూడా ఆఖరి నిమిషంలో ఎందుకు క్యాన్సిల్ అయినాయి అనేది చాలా మందికి ఇప్పటికి కూడా అర్థం కాని మిలియన్ డాలర్స్ ప్రశ్నగా మిగిలిపోయింది. చంద్రబాబు ప్రచారం చేసిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ప్రచారాన్ని ఢిల్లీలో ఒద్దనుకున్నారా.. లేకపోతే.. ఢిల్లీలో పవన్ కళ్యాణ్ ప్రచారం చేసినా.. బీజేపీ అధికారంలోకి రాదనే నమ్మకంతో ఉన్నారా.. ఒకవేళ భారతీయ జనతా పార్టీ అక్కడ అధికారంలోకి రాకపోతే తనపై అందరు వేలెత్తి చూపెడుతారనే ఉద్దేశ్యంతో ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి పవన్ కళ్యాణ్ దూరంగా ఉన్నారా అనేది తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
ఇదీ చదవండి: గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!
ఢిల్లీలో మాత్రం పవన్ కళ్యాణ్ పర్యటన ఆఖరి నిమిషంలో వాయిదా వేశారు. దానికి పవన్ కళ్యాణ్ కూడా షూటింగ్ బిజీ లో ఉన్నారా. లేదు ఆరోగ్యం ఏమైనా బాగాలేదా. రాజకీయ ఒత్తిళ్లు ఏమైనా ఎక్కువైయ్యాయా అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఆయన వెళ్లి ఆయన ప్రచారం చేయటం తెలుగుదేశం పార్టీ లేదా చంద్రబాబు నాయుడు పేరుని ఫేమ్
లోకి తీసుకురావడానికి తెర వెనక ఏమైనా ప్రయత్నాలు జరిగాయా అనేది తెలియాల్సి ఉంది. చంద్రబాబు నాయుడు మోడీని 2019లో తీవ్రంగా విమర్శించారు. అదే సమయంలో అరవింద్ కేజ్రివాల్ ని ఆకాశానికి ఎత్తారు. అలాంటి వ్యక్తితో ఇప్పుడు అరవింద్ కేజరివాల్ ని తిట్టి అక్కడ ఢిల్లీ అభివృద్ధి చెందలేదు మోడీకే ఓటు వేయండి అని చెప్తే ఏమన్నా ఇంపాక్ట్ ఉంటుందని పవన్ కళ్యాణ్ ని బీజేపీ పెద్దలు సైడ్ లైన్ చేశారా ఇవన్నీ కూడా బయటకు రావాల్సిన విషయాలు.
ప్రస్తుతానికి అయితే పవన్ కళ్యాణ్ ఎందుకు ఢిల్లీకి ఎందకు వెళ్ళలేదు. అనేది అయితే పూర్తి క్లారిటీ ఎవరికీ లేదు. ఆఖరి నిమిషంలో అయితే క్లియర్ గా వాయిదా పడిందనేది నిజం. జనసేన పార్టీ తరఫున బలిశెట్టి సత్యనారాయణ తో అక్కడ స్టేట్మెంట్ ఒకటి ఢిల్లీలో ఓ స్టేట్ మెంట్ ఇచ్చారు. మొత్తంగా పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో ఎందుకు దూరంగా పెట్టారనేది ఇపుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.