కోవిడ్ 19 ( Covid 19 ) నివారణ చర్యలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ( Pm Modi ) వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లతో మోదీ చర్చించారు. రాష్ట్రాల్లో వైద్య సదుపాయాల్ని గణనీయం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని ముఖ్యమంత్రులు కోరారు.
కరోనా నివారణ చర్యలపై వివిధ రాష్ట్రాలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ( Pm modi video conference ) ద్వారా సమీక్షించారు. కోవిడ్ 19 వైరస్ ( Covid 19 virus ) కట్టడికి రాష్ట్రాల్లో తీసుకుంటున్న చర్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan ) పలు అంశాల్ని మోదీ ముందుంచారు. రాష్ట్రంలో వైద్య సదుపాయాల్ని గణనీయంగా పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని కోరారు. మహా నగరాలతో పోలిస్తే ..ఏపీలో భారీ వైద్య సదుపాయాలున్న ఆసుపత్రులు లేవని వైఎస్ జగన్ ప్రధాని మోదీకు గుర్తు చేశారు. మరోవైపు కరోనా వైరస్ కట్టడికి రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యల్ని ఆయన వివరించారు.
రాష్ట్రంలో ఇప్పటివరకూ 25 లక్షలకు పైగా కోవిడ్ నిర్ధారణ పరీక్షల్ని ( Covid 19 Tests ) నిర్వహించినట్టు..ప్రతి పది లక్షల మందిలో 47 వేల 459 మందికి పరీక్షలు చేస్తున్నాట్టు చెప్పారు. క్లస్టర్లలో అయితే 85 నుంచి 90 శాతం పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రంలో మరణాల రేటు కేవలం 0.89 శాతం ఉందన్నారు. పరీక్షల విషయంలో రాష్ట్రం స్వావలంబన సాధించిందని మోదీకు చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11 వేలకు పైగా ఆక్సిజన్ బెడ్లు ఉన్నాయన్నారు. గత మూడు నెలల్లో 7 వేలకు పైగా బెడ్లు సమకూర్చుకున్నట్టు జగన్ వివరించారు. దాదాపు 2 లక్షల మంది వాలంటీర్లు క్షేత్రస్థాయిలో కోవిడ్ నివారణ చర్యల్లో పాల్గొంటున్నట్టు వైఎస్ జగన్ తెలిపారు. Also read: Vijayawada fire Accident: ప్రారంభమైన చర్యలు..ముగ్గురి అరెస్టు