Two killed in vizag road accident: బర్త్‌ డే పార్టీకి వెళ్లి ఇద్దరు సాఫ్ట్‌వేర్ల దుర్మరణం

software engineers died in road accident : అప్పటి వరకు సరదాసరదా గడిపిన వారు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. విశాఖపట్నంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు మృతి చెందారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 10, 2021, 12:28 PM IST
  • ఫ్రెండ్ బర్త్‌డే పార్టీకి వెళ్లి మృత్యు ఒడికి చేరుకున్న ఇద్దరు యువకులు
  • విశాఖపట్నంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు మృతి
  • పీఎం పాలెం క్రికెట్‌ స్టేడియం సమీపంలోని వీ కన్వెన్షన్‌ హాల్‌ ఎదుట ఘటన
Two killed in vizag road accident: బర్త్‌ డే పార్టీకి వెళ్లి ఇద్దరు సాఫ్ట్‌వేర్ల దుర్మరణం

Software engineers killed on spot in road accident at pm palem cricket stadium visakhapatnam : ఫ్రెండ్ బర్త్‌డే పార్టీకి వెళ్లి మృత్యు ఒడికి చేరుకున్నారు ఇద్దరు యువకులు. అప్పటి వరకు సరదాసరదా గడిపిన వారు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. విశాఖపట్నంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు (Two software engineers) మృతి చెందారు. పీఎం పాలెం క్రికెట్‌ స్టేడియం (pm palem cricket stadium) సమీపంలోని వీ కన్వెన్షన్‌ హాల్‌ (V Convention Hall) ఎదుట ఈ ఘటన జరిగింది. మంగళవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వాహనం.... సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు (Software Engineers) వెళ్తున్న బైక్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ధనరాజ్‌ (22) (Dhanraj‌), కే వినోద్‌ ఖన్నా (Vinod Khanna) (22) అక్కడికక్కడే దుర్మరణం చెందారు.

Also Read : Covid19 Update: రెండేళ్లలో 25 కోట్లమందికి కరోనా వైరస్, హాట్‌స్పాట్‌లు ఆ దేశాలే

మంగళవారం రాత్రి విశాఖపట్నంలోని (Visakhapatnam) మారికవలసలోని శారదానగర్‌ ప్రాంతానికి చెందిన ధనరాజ్‌, స్వతంతర్‌ నగర్‌కు చెందిన వినోద్‌ ఖన్నా తమ స్నేహితుడు బర్త్ డే వేడుకలకు వెళ్లారు. లా కళాశాల (Law College) సమీపంలోని తమ ఫ్రెండ్ ప్రశాంత్‌ బర్త్ డే పార్టీలో (Birthday party) కాసేపు సరదాగా గడిపారు. తర్వాత బైక్‌లో (Bike) పెట్రోల్‌ పోయించుకుందామని... కొమ్మాది పెట్రోల్‌ బంక్‌కు (Petrol Bunk) వెళ్లారు ధనరాజ్‌, వినోద్‌. 

అక్కడ బైక్‌లో పెట్రోల్‌ పోయించుకుని తిరిగి తమ ఫ్రెండ్ ఇంటికి వెళ్లేందుకు బైక్‌పై బయల్దేరారు. ఈ క్రమంలో పీఎం పాలెం క్రికెట్‌ స్టేడియం (pm palem cricket stadium) వద్దకు వెళ్లేసరికి.. గుర్తు తెలియని వాహనం బైక్‌ను ఢీకొట్టింది. దీంతో ధనరాజ్‌, వినోద్‌ స్పాట్‌లోనే చనిపోయారు. పీఎం పాలెం పోలీసులు (Police) కేసు (Case) నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి.

Also Read : Life imprisonment for gang rape : అత్యాచార వీడియో షేర్ చేసి దొరికిపోయారు.. ఐదుగురికి యావజ్జీవం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News