TDP Mahanadu In Rajahmundry: వందల కొద్ది సంక్షేమ పథకాలకు పేదలకు అందించిన పార్టీ తెలుగుదేశం అని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. హైదరాబాద్‌లో సంపద సృష్టించి ప్రపంచ పటంలో ఉంచిన ఘనత టీడీపేకే దక్కుతుందన్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత 2029కి దేశంలో నెంబర్ వన్ రాష్ట్రాన్ని ఉంచాలని ప్రణాళికలు రచించామన్నారు. వ్యవసాయ రంగాన్ని 11 శాతం వృద్ధి చెందించామని.. జలవనరులకు రూ.64వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడులు తెచ్చామని.. అవి గ్రౌండ్ అయ్యి ఉంటే 30 లక్షల మందికి ఉద్యోగాలు దొరికి ఉండేవన్నారు. శనివారం రాజమహేంద్రవరంలో నిర్వహించిన మహానాడులో ఆయన మాట్లాడారు.
టీడీపీ కార్యకర్తలు, నాయకులు 4 ఏళ్లుగా ఎన్నో త్యాగాలు చేశారని చంద్రబాబు అన్నారు. తప్పుడు కేసులు పెట్టారని.. జీవో నెం.1 వంటి చీకటి జీవోలను తెచ్చారని వివర్శించారు. కానీ ఏ ఒక్క నాయకుడు భయపడలేదన్నారు. మాచర్ల నియోజకవర్గంలో చంద్రయ్యను చంపే ముందు జగన్ అంటే వదిలిపెడతామని చెప్పినా.. కూడా జై తెలుగుదేశం అన్నారని.. అందుకే ఆయన పాడె మోశానని చెప్పారు. ప్రతి ఒక్క కార్యకర్తకు చంద్రన్న అండగా ఉంటాడని భరోసా ఇచ్చారు. కార్యకర్తల సంక్షేమం, అభివృద్ధి తన ధ్యేయమన్నారు.
"ఒక్క ఛాన్స్ అన్నాడు.. ముద్దులు పెట్టాడు. తండ్రి లేని బిడ్డను అన్నాడు. కోడి కత్తి డ్రామా ఆడి ఒక సైకో అధికారంలోకి వచ్చాడు. ప్రజావేదిక ద్వారా విధ్వంసానికి నాంది పలికాడు. పరిపాలన రివర్స్ లో పెట్టాడు. రాష్ట్రం భవిష్యత్ దెబ్బతింది. అమరావతి సర్వనాశనానికి పూనుకున్నాడు. మూడు రాజధానుల పేరుతో రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తయారు చేశారు. పోలవరం పూర్తి అయ్యి నదుల అనుసంధానం జరిగితే ప్రతి ఎకరాకు నీరందించాలని పనులు చేస్తే పోలవరాన్ని గోదావరిలో కలిపేశారు. ఒక్క రోడ్డు వేసిన ధాఖలాలు లేవు. వ్యవసాయం పూర్తిగా భ్రష్టుపట్టింది. ఎక్కడికక్కడ అవినీతి పెరిగిపోయింది. పెట్టుబడులు రావడం లేదు, జాబ్ క్యాలెండర్ లేదు. నిరుద్యోగులు ఏం చేయాలని దిక్కు తెలియని పరిస్థితి.
చదువుకోవాలంటే పక్క రాష్ట్రాలకు వెళ్లి చదువుకోవాల్సి వస్తుంది. లేని చట్టం పేరుతో దిశ పోలీస్ స్టేషన్‌ను రాజమండ్రిలో జగన్ ప్రారంభించారు. హోదా వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పి అధికారంలోకి వచ్చాక కేసుల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు. ఇచ్చిన ఒక్క హామీని నిలబెట్టుకోలేదు. అమ్మ ఒడి నాటకం, నాన్నబుడ్డి వాస్తవం. మద్యపాన నిషేధం అని హామీనిచ్చి మద్యాన్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకుంటున్నారు. జగన్ చేసిన అక్రమాలను చెప్పుకోవాలంటే ఇలాంటి మహానాడులు ఎన్నో కావాలి.." అని చంద్రబాబు అన్నారు.
రూ.2000 నోట్లు ఎక్కడా కనపడలేదని.. దేశంలోని నోట్లన్ని జగన్ రెడ్డి గ్యాంగ్ దాచిపెట్టుకున్నారని ఆరోపించారు. డిజిటల్ కరెన్సీకి నాంది పలికింది టీడీపీ ప్రభుత్వమేనని.. పెద్ద నోట్లను రద్దు చేస్తేనే నీతి వంతమైన ప్రభుత్వం వస్తుందని ఎప్పుడో చెప్పామన్నారు. పబ్లిక్, ప్రభుత్వం, ప్రైవేట్, పార్టనర్ షిప్ అనే పీ4తో పేద వాడిని ధనికుడి చేసేందుకు నాంది పలుకుదామన్నారు. రేపు ఫేజ్ 1 మ్యానిఫెస్టోను విడుదల చేయబోతున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో మనం ప్రారంభించిన పనులతో దేశానికే నెంబర్ 1 రాష్ట్రంగా వచ్చిందన్నారు. ఏపీలో విధ్వంసకర పాలన వలన చివర స్థానంలో ఉంటున్నామని.. మళ్లీ ఈ రాష్ట్రాన్ని గట్టెంక్కించే విధంగా కార్యక్రమాలు రూపొందించేలా ప్రణాళికలు రచిస్తున్నామని చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సైకిల్ సిద్ధంగా ఉందన్నారు.. రాష్ట్రంలో పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని విమర్శించారు. పేదల వాళ్లకు సంక్షేమం, రాష్ట్రానికి అభివృద్ధి ఎలా చేయాలో చర్చిద్దామన్నారు.
Also Read: Palnadu Murder Case: కుమారుడి తల నరికిన తండ్రి.. ఊరంతా తిరుగుతూ హల్‌చల్
Also Read: GT vs MI Highlights: నెట్ బౌలర్ టు మ్యాచ్ విన్నర్.. మోహిత్ శర్మ వాట్ ఏ బౌలింగ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి