ఆడపిల్ల మానంకు 5 లక్షలు.. ప్రాణంకు 10 లక్షలు ఇస్తారేమో! ఏపీ సీఎంపై మండిపడ్డ వంగలపూడి అనిత!!

Vangalapudi Anitha slams YS Jagan. ఏపీ సీఎం వైఎస్ జగన్, వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంపై టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత మండిపడ్డారు. 

Last Updated : Jan 21, 2022, 06:12 PM IST
  • మైనర్‌ బాలికపై యువకుడు అత్యాచారం
  • ఆడపిల్ల మానంకు 5 లక్షలు.. ప్రాణంకు 10 లక్షలు ఇస్తారేమో
  • ఏపీ సీఎంపై మండిపడ్డ వంగలపూడి అనిత
ఆడపిల్ల మానంకు 5 లక్షలు.. ప్రాణంకు 10 లక్షలు ఇస్తారేమో! ఏపీ సీఎంపై మండిపడ్డ వంగలపూడి అనిత!!

Vangalapudi Anitha slams YSRCP Govt: ఏపీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan), వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంపై టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత (Vangalapudi Anitha) మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఆడపిల్లలపై అత్యాచారాలు పెరిగిపోయాయన్నారు. ఆడపిల్లలకు రక్షణ కల్పించలేని ప్రభుత్వం ఉంటే ఎంత? లేకుంటే ఎంత? అని ఆరోపించారు. ఆడపిల్ల మానంకు 5 లక్షలు.. ప్రాణంకు 10 లక్షలు ఎక్సగ్రేషియా ప్రకటిస్తారేమో అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇద్దరు కుమార్తెలు ఉన్న వైఎస్ జగన్‌కి ఆడపిల్లల తల్లితండ్రుల ఆవేదన తెలియదా? అని వంగలపూడి అనిత ప్రశ్నించారు. 

విశాఖ జిల్లా నక్కపల్లి (Nakkapalle) మండలం రాజయ్యపేట (Rajayyapeta)లో గురువారం ఓ మైనర్‌ బాలికపై యువకుడు అత్యాచారం (Minor Rape) చేసిన విషయం తెలిసిందే. నిన్న సాయంత్రం స్కూల్‌ వదిలిన తర్వాత బాలికను అదే గ్రామానికి చెందిన గొడ్డు నాగేష్‌ (21) అనే యువకుడు గ్రామానికి దూరంగా ఉన్న జీడి తోటలోకి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. రాత్రి 9 గంటల సమయంలో బాలికను ఊరికి దూరంగా విడిచి తల్లిదండ్రులకు చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఇంటికొచ్చిన బాలిక జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో.. నక్కపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Also Read: Bhumika Chawla Swimming: భూమిక బికినీ అందాలు అదరహో.. గ్లామర్ టచ్ మాములుగా లేదుగా!!

ఈ ఘటనపై టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత మాటాడుతూ... 'వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఆడపిల్లలపై అత్యాచారాలు పెరిగిపోయాయి. ఆడపిల్లలకు రక్షణ కల్పించలేని ప్రభుత్వం ఉంటే ఎంత? లేకపోతే ఎంత?. ఇద్దరు కుమార్తెలు ఉన్న వైఎస్ జగన్‌కి ఆడపిల్లల తల్లితండ్రుల ఆవేదన తెలియదా?. రోజురోజుకీ ఆడపిల్లలపై అత్యాచారాలు జరుగుతుంటే.. తాడేపల్లిలో నోరు మెదపకుండా జగన్ ఇంట్లోనే ఉంటున్నారు. హోమ్ శాఖ మంత్రి సుచరిత ఆడపిల్లల అత్యాచారాలపై నోరు మెదపకుండా ఉండటం దురదృష్టకరం. ఈ ప్రభుత్వం తరపున ఆడపిల్లల మానంకు 5 లక్షలు, ప్రాణంకు 10 లక్షలు ఎక్సగ్రేషియా ప్రకటించి చేతులు దులుపుకొంటారేమో' అని మండిపడ్డారు. 

'అమలులో లేని దిశా చట్టం గురించి పబ్లిసిటీ చేసుకోవడం ఏమాత్రం తగదు. ఆడపిల్లలకు న్యాయం చేయలేకపోతే.. ఏపీ సీఎం జగన్, హోమ్ మంత్రి సుచరితలు రాజీనామా చేయాలి. మైనర్ బాలికపై అత్యాచార యత్నంకు పాల్పడిన వారికి కఠినంగా శిక్ష పడేలా చేయాలి. అలా చేయని యెడల టీడీపీ నుండి పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం' అని టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత హెచ్చరించారు. 

Also Read: Chicken Cooked in Cough Syrup: దగ్గు సిరప్‌తో చికెన్ రెసిపీ.. ఆరోగ్యానికి మంచిదేనా? డాక్టర్లు ఏం చెబుతున్నారో తెలుసా!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News