విజయవాడ: వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానిపై టీడీపీ ఎమ్మెల్యే తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ పాదయాత్ర సందర్భంలో కొడాలి నాని చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అదే సందర్భంగా వంశీ తన మిత్రుడని చెప్పుకున్నారు. దీంతో వంశీపై పలు ఊహాగానాలు వెలువడ్డాయి. అ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యేపై ఘాటుగా వంశీ స్పందించారు. ఒకప్పుడు నాని తనకు మంచి స్నేహితుడని..ఇప్పుడు కాదని వివరణ ఇచ్చారు. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని వంశీ హెచ్చరించారు.
వైసీపీ ఎమ్మెల్యే కొడాలి పిచ్చి కుక్కలా మాట్లాడుతున్నారని.. ఆయన నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని హెచ్చరించారు. కొడాలి నానితో పాటు మరి కొందరు వైసీపీ నేతలు బరితెగించి మాట్లాడుతున్నారని ఆరోపించారు.. అలాంటి వాళ్ళను జగన్ కంట్రోల్ చేయాలని... లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఈ సందర్భంగా వైసీపీని వల్లభనేని వంశీ హెచ్చరించారు.