ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రేపటి పార్లమెంట్ సమావేశాల్లో ఎన్డీయే ప్రభుత్వంపై వైసీపీ ప్రవేశపెట్టనున్న అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని టీడీపీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో ఎన్డీయే నుంచి వైదొలిగే ఆలోచన కూడా చేస్తోంది. ఉయదం నుంచి పార్టీ నేతలతో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం చంద్రబాబు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ భేటీలో మంత్రులు, పార్టీకి చెందిన కీలక నేతలు పాల్గొన్నారు.
అవిశ్వాసం అంశంపై పార్టీ నేతల అభిప్రాయాలను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. వైసీపీ అవిశ్వాసం పేరుతో టీడీపీని దోషిగా చూపించే ప్రయత్నం చేస్తుందని మోజార్టీ నేతలు అభిప్రాయపడ్డారు. వైసీసీ బీజేపీతో కలిసే ఈ అవిశ్వాస నాటకం ఆడుతోందన్నారు. ఈ సందర్భంలో మద్దతు ఇవ్వడమే సబబు అని పలువురు మంత్రులు అభిప్రాయపడ్డారు. రాష్ట్రప్రయోజాల కోసం ఎవరు మద్దతిచ్చినా మద్దతు పలకాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.
డైలమాలో జగన్
ఎన్డీయేతో దోస్తీ చేయాలనుకుంటున్న వైసీపీ.. అవిశ్వాసం పెట్టాలా వద్దా అని డైలమాలో స్థితిలో చంద్రబాబు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో అవిశ్వాసం కచ్చితంగా పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. దీనిపై వైసీపీ చీఫ్ జగన్ ఏ మేరకు స్పందిస్తారనే దానిపై ఉత్కంఠత నెలకొంది.