Tirupati: భక్తుల దర్శనాలకు ఆటంకం లేదు

తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనాలపై తిరుపతి లాక్ డౌన్ ప్రభావం ఉండదని  టీటీడీ స్పష్టం చేసింది. ఆన్ లైన్ లో బుక్ చేసుకున్న భక్తులు స్వేచ్ఛగా తిరుమల దర్శనం చేసుకోవచ్చు.  

Last Updated : Jul 21, 2020, 02:42 PM IST
Tirupati: భక్తుల దర్శనాలకు ఆటంకం లేదు

తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనాలపై తిరుపతి లాక్ డౌన్ ప్రభావం ఉండదని  టీటీడీ స్పష్టం చేసింది. ఆన్ లైన్ లో బుక్ చేసుకున్న భక్తులు స్వేచ్ఛగా తిరుమల దర్శనం చేసుకోవచ్చు.

కరోనా సంక్రమణ నేపధ్యంలో..కేసుల సంఖ్య పెరుగుతున్న కారణంగా తిరుపతిలో రెండువారాలపాటు లాక్ డౌన్ విధించారు. ఈ పరిస్థితుల్లో తిరుమల దర్శనాలపై ప్రభావం ఉంటుందా అనే అనుమానాలు అధికమయ్యాయి. టీటీడీ ఈ అనుమానాల్ని నివృత్తి చేసింది. దీనిపై టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టత ఇచ్చారు. లాక్ డౌన్ ప్రభావం తిరుమల దర్శనాలపై ఉండదని స్పష్టం చేశారు. ఆన్ లైన్ లో బుక్ చేసుకున్నవారు స్వేచ్ఛగా దర్శనాలు చేసుకోవచ్చని సుబ్బారెడ్డి తెలిపారు. తిరుపతి లాక్ డౌన్ నేపధ్యంలో స్థానిక బుకింగ్ మాత్రం నిలిపివేశామని చెప్పారు. ఇక కరోనా వైరస్ సోకిన అర్చకులు, ఉద్యోగులకు మెరుగైన చికిత్స అందిస్తున్నట్టు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. కంటైన్ మెంట్ జోన్లలో ఉండేవారు మాత్రం తిరుమలకు రావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. Also read: Tirupati Lockdown: తిరుపతిలో రెండు వారాల లాక్‌డౌన్

Trending News