Tragedic Accident 5 Dead: ఈరోజు ఉదయం కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వేద పాఠశాలకు చెందిన నలుగురు ఏపీ విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. వీరంతా రఘునందతీర్థ ఉత్సవాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రాయచూరు జిల్లా సింధనూరు వద్ద టైర్ పంక్చర్ కావడంతో తుఫాను వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో మంత్రాలయం వేద పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రయాణ సమయంలో తుఫాన్‌లో మొత్తం డ్రైవర్ సహా మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చదవండి: తెలంగాణను వణికిస్తోన్న చలి.. ఈ 2 రోజులు మరింత పెరిగే అవకాశం జాగ్రత్త..
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఇక గాయాలైన క్షతగాత్రులను కర్నూలు జిల్లా వాసులుగా గుర్తించారు. వారిని సిందనూర్ ఆసుపత్రికి తరలించారు. ప్రయాణ సమయంలో మొత్తం ఈ ఆరాధనకు 14 మంది విద్యార్థులు వాహనంలో బయలుదేరారు. అందులో మృతి చెందిన వారు డ్రైవర్ శివ ముగ్గురు విద్యార్థులు సుజేంద్ర, అవిలాష్, హైవదనగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు
ఇదీ చదవండి: తిరుమల భక్తులకు బంపర్ గుడ్‌న్యూస్.. టోకెన్లు లేకుండానే శ్రీవారి దర్శనం?
ఈరోజు బుధవారం వేకువ జామున ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దీంతో మంత్రాలయంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విద్యార్థులంతా కర్ణాటకలోని హంపి క్షేత్రంలో నరహరి తీర్థ ఆరాధన కోసం బయలు దేరారు. అయితే మధ్యలోనే వాహనం అదుపుతప్పి బోల్తా పడినట్లు సమాచారం.
మరో ఘోర ప్రమాదం 10 మంది మృతి..
కర్ణాటకలో మరో ఘోర ప్రమాదం జరిగింది. ముఖ్యంగా గుల్లాపూర్ ఘట్ట జాతీయ రహదారిపై కూరగాయ లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. దీంతో అక్కడికక్కడే 10 మంది మృతి చెందారు. కన్నడ జిల్లా ఎల్లాపూర్ తాలూకాలో ఈ ఘటన చోటు చేసుకుంది. సానూరు నుంచి ఎల్లాపూర్ వెళ్తుంటాగా ట్రక్కు 50 మీటర్ల లోయలో పడింది. దీంతో పది మంది అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన పది మందిని హుబ్బల్లి కిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
#WATCH | Karnataka | 10 died and 15 injured after a truck carrying them met with an accident early morning today. All of them were travelling to Kumta market from Savanur to sell vegetables: SP Narayana M, Karwar, Uttara Kannada
(Visuals from the spot) https://t.co/hJQ84aljHw pic.twitter.com/dVtNEKQna7
— ANI (@ANI) January 22, 2025
ఈరోజు ఉదయం 4:00 సమయంలో యాక్సిడెంట్ జరిగిందని సమాచారం. పక్క నుంచి వాహనం వెళ్తున్న నేపథ్యంలో కూరగాయల లోడ్ డ్రైవర్ ట్రక్కును పక్కకు మళ్లించాడు. దీంతో బస్సు అదుపుతప్పి 50 మీటర్ల లోయలో పడిపోయింది. అయితే లోయకు పక్కన ఎలాంటి రక్షణ గోడ లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో దాదాపు 20 మంది వరకు తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా మార్కెట్ లో కూరగాయలు అమ్మడానికి వెళ్తున్నారు.
అయితే తెల్లవారుజాము సమయంలో ఎక్కువ పొగ మంచు కారణంగా కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. అందుకే వాహనదారులు లైట్లు వేసుకొని ప్రయాణం చేయాలని సూచించారు. వీలైనంతగా జాగ్రత్తలు తీసుకొని ప్రయాణాలు చేయాలి. ఎక్కువ ప్రమాదాలు టైర్ పంక్చర్, అదుపుతప్పి లేదా ఏవైనా జంతువులను అడ్డుగా వచ్చినప్పుడు జరుగుతున్నాయి. నిద్ర, మద్యం కూడా దీనికి ప్రధాన కారణం ఎక్కువగా ఉదయం పూట ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.