Once Again YS Jagan CM: కారణాల గురించి ఆరా తీయకుండా ఉంటే రాజకీయాల నుంచి హుందాగా వైదొలిగిన మాజీ ఎంపీ విజయి సాయిరెడ్డి చెప్పినట్టుగానే తన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడారు. వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేస్తూ తన రాజీనామా లేఖను పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పంపించినట్లు వెల్లడించారు. అయితే రాజీనామా చేస్తూనే ఒక ఆసక్తికర ప్రకటన చేశారు. మరోసారి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. ఆయన చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది.
Also Read: Tirumala: తిరుమలలో చాగంటి కోటేశ్వర రావుకు అవమానం కేసులో బిగ్ ట్విస్ట్
వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేస్తూ లేఖను పంపించినట్లు శుక్రవారం రాత్రి తెలిపారు. ఈ మేరకు 'ఎక్స్' వేదికగా ఆయన కీలక పోస్టు చేశారు. 'వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ పదవులకు ఈ రోజు నా రాజీనామాను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పంపించా. 2029 ఎన్నికల్లో వైఎస్ జగన్ భారీ మెజారిటీతో మరోసారి ముఖ్యమంత్రి కావాలని నిండు మనసుతో కోరుకుంటున్నా' అని విజయ సాయిరెడ్డి ఆకాంక్షించారు.
Also Read: Vijayasai Reddy: వైఎస్ వివేకా హత్యపై సంచలనం రేపిన విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు
'నా రాజకీయ ప్రయాణంలో నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నా. శత్రుత్వాలకు.. అపార్థాలకు అవకాశం ఇవ్వని విధంగా జీవించాలని వ్యవసాయ ప్రపంచంలో నా మరో ప్రస్థానాన్ని ప్రారంభించా' అని 'ఎక్స్'లో విజయ సాయిరెడ్డి తెలిపారు. కాగా ఇటీవల రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన విజయ సాయిరెడ్డి ఆ మరుసటి రోజు రాజ్యసభ పదవికి రాజీనామా చేయడం.. రాజీనామా ఆమోదం పొందడం వంటివి చకాచకా జరిగిపోయాయి. రాజకీయాలను వీడిన విజయ సాయిరెడ్డి తాను వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించి అన్నట్టుగానే పొలం బాటలోకి వెళ్లారు. సాగు చేస్తున్న కొన్ని ఫొటోలను పంచుకున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.