Chandrababu Naidu Swearing Ceremony: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ప్రమాణస్వీకారం సందర్భంగా ఏపీలో పండుగ వాతావరణం అలుముకుంది. ముఖ్యంగా ప్రమాణస్వీకారం జరగనున్న గన్నవరం ఎయిర్‌పోర్టు సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ పరిసరాలు విద్యుత్ ధగధగలతో మెరిసిపోతున్నాయి. ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని అతిరథ మహారథులు తరలివస్తున్నారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి కుటుంబంతో సహా ఇప్పటికే ఏపీకి వచ్చారు. ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా కూడా చేరుకున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ ఏపీలో అడుగుపెట్టారు.
Also Read: Chandrababu Revanth Reddy: చంద్రబాబు, రేవంత్ మధ్య ఏం జరిగింది? ఎందుకు ఆహ్వానం పంపలేదు
ప్రముఖుల రాక
కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయానికి ప్రముఖుల తాకిడి పెరిగింది. కేంద్ర మంత్రులు, సినీ, రాజకీయ ప్రముఖులు విమానాల్లో విజయవాడకు చేరుకుంటున్నారు. ఢిల్లీ నుంచి నేరుగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా గన్నవరం చేరుకున్నారు. ఆయనకు ఎంపీ పురందేశ్వరి, టీడీపీ తరఫున నారా లోకేశ్, సుజనాచౌదరి, సీఎం రమేశ్ తదితరులు ఆహ్వానం పలికారు. అనంతరం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి అమిత్‌షా చేరుకుని కొద్దిసేపు మాట్లాడారు. అనంతరం అమిత్ షాకు చంద్రబాబు విందు ఇచ్చారు. అక్కడి నుంచి విజయవాడలోని నోవాటెల్ హోటల్‌లో అమిత్‌షా రాత్ర బస చేయనున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్ పోర్టుకు మెగాస్టార్ చిరంజీవి తన సతీమణి సురేఖ, కుమార్తె శ్రీజతో కలిసి వచ్చారు. వారికి అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గాన నేరుగా విజయవాడకు వారు వెళ్లారు. ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి సూపర్ స్టార్ హీరో రజినీకాంత్ చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా నోవాటెల్ హోటల్‌కు వెళ్లారు.
Also Read: Chandrababu: చంద్రబాబు ప్రమాణస్వీకారం రోజే నిరుద్యోగులకు పండుగ.. తొలి సంతకం దానిపైనే
ఏపీలో పండుగ వాతావరణం
కొత్త ప్రభుత్వం కొలువుదీరనుండడంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పండుగ వాతావరణం అలుముకుంది. ప్రమాణస్వీకారం అమరావతి ప్రాంతంలో జరుగుతుండగా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు విద్యుద్దీపాల వెలుగులో మెరుస్తున్నాయి. అధికారులు పండగ వాతావరణంలో నిర్వహిస్తున్నారు.ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్ అలంకరణ చేశారు. అన్ని కలెక్టర్ కార్యాలయాలను అందంగా అలంకరించారు. ముఖ్యమైన చౌరస్తాల్లో కూడా అలంకరణ ఏర్పాటు చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని జిల్లాలోని 29 ప్రదేశాల్లో ప్రత్యేక వేదికలపై ప్రజల కోసం లైవ్ టెలికాస్ట్ ఏర్పాట్లు చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook