Goutham Reddy Death: ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం అందర్నీ షాక్‌కు గురి చేసింది. నిత్యం జిమ్‌తో ఆరోగ్యంగా ఉండే మంత్రికి అంత తీవ్రమైన గుండెపోటుకు కారణమేంటి..అసలు మరణానికి 2 గంటల ముందు ఏం జరిగింది
ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుకు గురై..ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండే మంత్రి గౌతమ్ రెడ్డి అంత హఠాత్తుగా ఎలా మరణించారనేది ఎవరికీ అంతుబట్టడం లేదు. ఎందుకంటే ఎక్కడికి వెళ్లినా..అనునిత్యం జిమ్ సౌకర్యం ఉండేట్టు చూసుకుంటారు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటూ..అనారోగ్యానికి చాలా దూరంగా ఉంటారు. రాత్రి అందరితో కలిసి నిశ్చితార్ధంలో పాల్గొన్న మంత్రి గౌతమ్ రెడ్డి ..ఉదయానికి లేరంటే ఎలా నమ్మేది. ఎలా జీర్ణించుకునేది. ఈ ప్రశ్నలే ఇప్పుడు అందర్నీ వేధిస్తున్నాయి. అసలాయన మరణానికి 2 గంటల ముందు ఏం జరిగిందనేది ఆసక్తి రేపుతోంది. అందరూ ఉదయం నుంచి ఏం జరిగిందనే విషయంపై చర్చించుకుంటున్నారు.
మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి ప్రతిరోజూ ఉదయం 5 గంటలకు నిద్రలేచి..బెడ్ కాఫీ తాగే అలవాటుంది. ఇవాళ అలా జరగలేదు. ఉదయం 5 గంటలకు లేవకుండా...7 గంటలకు నిద్ర లేచారు. 7 గంటల 10 నిమిషాలకు బయటికొచ్చి సోఫాలో కూర్చున్నారు. ఐదు నిమిషాలకు అంటే 7 గంటల 15 నిమిషాలకు పనిమనిషి కాఫీ ఇస్తుంటే వద్దన్నారట. కాస్సేపటికి 7 గంటల 25 నిమిషాలకు ఒళ్లంతా చెమటలతో గుండె పట్టుకున్నారు. వెంటనే ఇంట్లో అందరూ అప్రమత్తమయ్యారు. అప్పటికే సోఫాలో కుప్పకూలిన గౌతమ్ రెడ్డికి ఇంట్లో కుటుంబసభ్యులు సపర్యలు చేసి..మరో 15 నిమిషాల్లో అపోలో ఆసుపత్రికి తరలించారు. అపోలో వైద్యులు ఐసీయూలో చేర్చి అత్యవసర చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. 9 గంటలకు చనిపోయినట్టు నిర్ధారించారు.
అంటే ఉదయం 7 గంటల 45 నిమిషాల నుంచి 9 గంటల వరకూ దాదాపు 90 నిమిషాలపాటు ఆసుపత్రిలో వైద్యులు శతవిధాలుగా ప్రయత్నించినా లాభం లేకపోయింది. 9 గంటల 15 నిమిషాలకు చనిపోయినట్టు ప్రకటించారు. గౌతమ్ రెడ్డిని ఆసుపత్రికి తీసుకొచ్చేసరికే ఆయన శ్వాస ఆడట్లేదని వైద్యులు గుర్తించారు. అంటే ఇంట్లో కుప్పకూలినప్పుడే ఆయన ప్రాణం పోయిందా..అంత తీవ్రమైన గుండెపోటు ఎలా వచ్చింది. సింగిల్ స్ట్రోక్‌తోనే అంత ఆరోగ్యంగా ఉండే వ్యక్తి ఎలా మరణించారు..ఇవే ఇప్పుడు అందర్నీ వేధిస్తున్న ప్రశ్నలు.
Also read: Goutam Reddy Funerals: ఎల్లుండి బుధవారం నాడు మంత్రి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook