YCP Ex MLA Thopudurthi Prakash Reddy: అనంతపురం జిల్లాలో మహేష్ రెడ్డి అనే యువకుడి మృతి విషయంలో తనపై వస్తున్న రాజకీయపరమైన ఆరోపణలపై మాజీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. టీడీపీ నాయకుడు పరిటాల శ్రీరామ్ చేసిన కామెంట్స్‌పై మండిపడ్డారు. అనంతపురం రూరల్ మండలం సోములదొడ్డి సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న తిమ్మిరెడ్డి మహేశ్వరరెడ్డి తమ గ్రామానికి చెందినవాడని తెలిపారు. తమకు దూరపు బంధువు కూడా అని చెప్పారు. "తండ్రి మలిరెడ్డి 30 ఏళ్లుగా మా చిన్నాన్న, తన సోదరుడికి ముఖ్య అనుచరుడిగా ఉన్నాడు. ఆయనకు పెళ్లి చేసింది కూడా మా తండ్రే. మాగ్రామంలో ఉన్న యువత చెడుమార్గంలో తిరగకూడదనే ఉద్దేశంతో, నేరం, చట్టం అంటే తెలీకుండా వ్యవహరిస్తుండడంతో మా సోదరుడు సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. వాడు వ్యక్తిగత ఇబ్బందులతో బలవన్మరణానికి పాల్పడితే.. దీన్ని రాజకీయం ఎందుకు చేస్తున్నారు’’ అని అన్నారు.
"మహేశ్వరరెడ్డి తప్పుడు స్నేహాలతో తప్పుడు మార్గాల్లో వెళ్తున్నాడని తెలిసి పలుమార్లు తండ్రి మలిరెడ్డిని మా కుటుంబ సభ్యులు హెచ్చరించారు. ‘వాడు నామాట వినడం లేదు మామా’ అంటూ పలు సందర్భాల్లో మలిరెడ్డి చెప్పాడు. ఆత్మహత్య చేసుకున్న మహేశ్వరరెడ్డి స్నేహితులు, గర్ల్‌ఫ్రెండ్స్‌ను విచారించండి. వాళ్ల తండ్రి మలిరెడ్డి మాకు చాలా దగ్గరగా ఉండేవాడు. పరిటాల సునీత కాన్వాయ్‌పై చెప్పులేసిన కేసులో మొదటి ముద్దాయి. పరిటాల శ్రీరామ్ వాహనాలపై రాళ్లదాడి చేసిన కేసులో ప్రధాన ముద్దాయి. ఎన్నికలకు ముందు రెన్నెళ్ల వరకు నా వద్దకు వచ్చారు.
పాలచెర్ల గ్రామానికి చెందిన బంగారు మురళీ అనే యువకుడు ముందు రోజు రాత్రి సోములదొడ్డి సమీపంలోని రైల్వేట్రాక్ వద్ద మహేశ్వరరెడ్డిని బైకులో వదిలిపెట్టాడు. తన ఫ్రెండ్స్ వస్తున్నారు డిన్నరు ఉందని చెప్పి డ్రాప్ చేయించుకున్నాడు. మళ్లీ వచ్చి నన్ను పికప్ చేసుకోమని చెప్పి వెళ్లిపోయాడు. ఆ తర్వాత మురళీతో పాటు ఇంకొందరు స్నేహితులకు వాట్సాప్, ఫేస్బుక్లో చాటింగ్ చేశాడు. తాను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పినా.. ఏదో తాగి మాట్లాడుతున్నాడనుకుని సీరియస్‌గా తీసుకోలేదు. ఉదయం వచ్చి చూసే సరికి అనర్థం జరిగిపోయింది. లవ్ ఫెయిల్యూర్‌కు సంబంధించిన కోటేషన్లు, జీవితం ముగిసిపోయింది ఇక చాలిస్తున్నాననే అర్థం వచ్చేలా మెసేజ్‌లు, స్టేటస్లు పెట్టాడు.
ఎన్నికలు ముగిసిన రెన్నెళ్ల తర్వాత అనంతపురం వన్‌టౌన్ పీఎస్‌లో తనపై కేసు నమోదుచేశారంటూ మహేశ్వరరెడ్డి తన సోదరుడితో చెప్పాడు. వ్యక్తిగత సమస్యలు ఉన్నాయి. లవ్ ఫెల్యూర్ అయింది. ఇవికాకుండా ఇంకా కొన్ని సమస్యలుండేవి. తన సోదరుడికి చెప్పుకుని సాయం కూడా అడిగాడు. తొందరపాటు నిర్ణయం తీసుకుని ఇలా చేసుకున్నాడని తామంతా బాధపడుతున్నాం. పరిటాల శ్రీరామ్ వద్దకు వెళ్లి వచ్చేవాడు. అప్పులు ఎక్కువగా ఉండడంతో ఆర్థికసాయం చేస్తానని, లవ్‌ఫెయిల్యూర్ సమస్యను పరిటాల శ్రీరామ్ పరిష్కరిస్తానని హామీ ఇచ్చింటే వెళ్లినట్లు అక్కడక్కడా చెప్పుకున్నాడు. ఆ సమయంలోనూ మాకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టాడు. తర్వాత కూడా మా వద్దకు వచ్చి సాయం పొందాడు. మా పిల్లోడు కదా..? అని పట్టించుకోలేదు.
తోపుదుర్తి సోదరులపై దుష్ప్రచారం చేయకపోతే పరిటాల కుటుంబానికి రాజకీయ ఉనికి ఉండదు. ఎందుకంటే వారు చెప్పేవన్నీ శ్రీరంగనీతులు చేసేవన్నీ దోపిడీ కార్యక్రమాలు. ప్రజల కడుపులు కొట్టిన చంద్రబాబు, పరిటాల కుటుంబం ప్రజలను ఏమి చేశామని ఓట్లు అడుగుతారు. వ్యక్తిగత ఇబ్బందులతో వెళ్లి బలవన్మరణానికి పాల్పడితే.. దీన్ని రాజకీయం ఎందుకు చేస్తున్నారు. మొబైల్ సీజ్ చేశారు.. ఇన్కమింగ్, ఔట్ గోయింగ్ కాల్స్ పరిశీలించండి. ఎవరెవరికి మేసెజ్‌లు పెట్టాడు. స్టేటస్లు ఏమి పెట్టాడు. ఫేస్బుక్లో ఏమి మెసేజ్‌లు పెట్టాడో విచారణ చేయండి. ఎవరైనా ట్రైన్ కింద పడ్డాడని డ్రైవరు గుర్తిస్తే తర్వాత స్టేషన్లో ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. మరి ఆవిధంగా ఇచ్చారా లేదా అని విచారించండి." అని తోపుదుర్తి డిమాండ్ చేశారు.
Also Read: SEBI Chief: సెబీ చీఫ్ పోస్టుకు రిక్రూట్ మెంట్..ఫిబ్రవరి 17వ తేదీ చివరి గడువు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి