108 Ambulance: ఆపద కాలంలో ప్రాణాన్ని నిలిపే 108 అంబులెన్స్ సేవలపై ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిలదీశారు. ఫోన్ కొడితే కుయ్ కుయ్ అంటూ వచ్చే అపర సంజీవని 108 అంబులెన్స్ సేవలు సక్రమగా కొనసాగడం లేదని విమర్శించారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా అంబులెన్స్ సేవలు దారుణంగా మారుతున్నాయని వాపోయారు.
Also Read: YS Sharmila: విషనాగుల వెనుక ఉన్న అనకొండ వైఎస్ జగన్‌ను అరెస్ట్ చేయాలి
తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 108 అంబులెన్స్ సిబ్బంది సమ్మె నోటీస్ ఇవ్వగా.. వైఎస్ షర్మిల మద్దతు కోసం బుధవారం వారు కలిశారు. అయితే వారి సమ్మెకు షర్మిల నిరాకరించి షాక్ ఇవ్వగా.. అనంతరం ఉద్యోగుల పోరాటానికి మాత్రం మద్దతు తెలపడం గమనార్హం. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో 108 అంబులెన్స్‌లకు ఆపద వచ్చిపడిందని చెప్పారు. ఫోన్ కొడితే కుయ్ కుయ్ మంటూ క్షతగాత్రుల వద్దకు చేరే ఆరోగ్య ప్రదాయిని మూగబోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అత్యవసర పరిస్థితిలో ప్రాణాలకు అండగా నిలిచే అంబులెన్స్ వ్యవస్థను ప్రతీకార రాజకీయాలకు వాడుకుంటున్నారని షర్మిల మండిపడ్డారు.
Also Read: YS Sharmila: దీపం పథకంలో సగం మంది మహిళలకు కోత పెడతారా? బడ్జెట్‌పై షర్మిల విమర్శలు
వాహనాల్లో డీజిల్ పోయకుండా, మెడికల్ ఏక్యూప్మెంట్ సమకూర్చకుండా.. మరమ్మతులు చేయించకుండా వ్యవస్థను నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందని కూటమి ప్రభుత్వంపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంధనం లేదని గత నెల 140 వాహనాలు ఆపడం ఏమిటి? అని ప్రశ్నించారు. 90 వాహనాలు ఇప్పటికీ రిపేర్లు ఉన్నా పట్టించుకోకపోవడం ఏమిటి? అని నిలదీశారు. తన తండ్రి వైఎస్సార్ మానస పుత్రిక 108 అంబులెన్స్ అని వివరించారు.
'వైఎస్సార్ దూర దృష్టికి నిదర్శనమైన 108 వ్యవస్థ దేశంలో ఎన్నో రాష్ట్రాలకు ఆదర్శం. లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన సంజీవని. ఇలాంటి వ్యవస్థకు ప్రభుత్వాలు మారినప్పుడల్లా గ్రహణం పడుతోంది' అని వైఎస్ షర్మిల వెల్లడించారు. ఎవరు అధికారంలో ఉన్నా.. అంబులెన్స్ ఆగకుండా ఉండాలంటే వ్యవస్థను పూర్తిగా ప్రభుత్వంలో విలీనం చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఈ నెల 25వ తేదీ నుంచి సమ్మె చేపట్టనున్న 108 అంబులెన్స్ సిబ్బందిని ప్రభుత్వం వెంటనే చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.