7th Pay Commission Latest News: న్యూ ఇయర్‌లో కేంద్రం నుంచి గుడ్ న్యూస్ వస్తుందని ఆశించిన ఉద్యోగులకు నిరాశే ఎదురైంది. కరోనా సమయంలో నిలిపివేసిన 18 నెలల డీఏ బకాయిలపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. ఆర్థిక సమస్యల కారణంగా బకాయిలను విడుదల చేయడం సాధ్యంకాదని స్పష్టం చేసింది. 7వ వేతన సంఘం సిఫార్సులపై కేంద్ర ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న కరువు భత్యం, పెన్షనర్లకు డియర్‌నెస్ రిలీఫ్ రిలీజ్ చేయడం కుదరని చెప్పింది.
18 నెలల పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను ఈసారి పెన్షనర్లకు అందదని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో రాజ్యసభలో స్పష్టం చేసింది. ఉద్యోగులకు ఈ బకాయిల మూడు విడతల సొమ్మును డెలివరీ చేయబోమని శాఖ తెలిపింది. పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను ఈ నెలలోనే కేంద్ర ప్రభుత్వం క్లియర్ చేస్తుందని ఆశించిన ఉద్యోగులను ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటన నిరాశకు గురిచేస్తోంది.
కోవిడ్ మహమ్మారి కారణంగా జూలై 2020 నుంచి 18 నెలల వరకు మూడు విడతల డీఏ బకాయిలను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. జూలై 2021లో ప్రభుత్వం డియర్‌నెస్ అలవెన్స్‌ని పునరుద్ధరించింది. అయితే 18 నెలలుగా చెల్లించని మూడు చెల్లింపుల గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. ఆర్థిక మంత్రి శాఖ రాజ్యసభలో సమాధానమిస్తూ.. కరోనావైరస్ మహమ్మారి కారణంగా పెన్షనర్లకు డియర్‌నెస్ అలవెన్స్‌లో మూడు విడతలు విడుదల చేయకూడదని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పింది. లాక్‌డౌన్ కారణంగా ప్రభుత్వం ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటోందని పేర్కొంది.
జూలై 1, 2021 నుంచి 7వ వేతన సంఘం సిఫారసుల మేరకు కేంద్రం కరువు భత్యాన్ని 11 శాతం పెంచింది. దీంతో డీఏ 17 నుంచి 28 శాతానికి పెరిగింది. ప్రస్తుతం డీఏ 38 శాతానికి చేరుకుంది. మరోవైపు లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పెండింగ్ డీఏపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఉద్యోగులు ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆర్థికశాక ప్రకటనతో అసంతృప్తికి గురవుతున్నారు. పెండింగ్‌లో డీఏ బకాయిలపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే.. ఉద్యోగుల ఖాతాల్లో రూ.2 లక్షలు వచ్చే అవకాశం ఉండేది.
Also Read: CM Jagan: సీఎం జగన్ బర్త్ డే స్పెషల్.. విద్యార్థులకు అదిరిపోయే గిఫ్ట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook