Airtel Best Plan: దేశంలో బీఎస్ఎన్ఎల్ కాకుండా మూడు ప్రైవేట్ టెలీకం కంపెనీలున్నాయి. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా. కేవలం మూడే కంపెనీలు కావడంతో ధరలు కూడా భారీగా ఉంటున్నాయి. ప్రతి నెలా రీఛార్జ్ చేయించకపోతే సేవలు నిలిచిపోతుంటాయి. నెల నెలా రీఛార్జ్ అంటే ఇబ్బందే మరి.
మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ప్లాన్స్‌లో చాలావరకూ డేటాతో పాటు వస్తున్నాయి. కొందరికి డేటా అంతగా అవసరం ఉండకపోవచ్చు. కేవలం టాక్ టైమ్ కోసమే ఫోన్ వినియోగిస్తుంటారు. ఇంట్లోని వైఫైనే ఎక్కువగా ఉపయోగించుకుంటుంటారు. అటువంటి పరిస్థితుల్లో డేటాతో పాటు ప్రతి నెలా రీఛార్జ్ కోసం ఖర్చుపెట్టాలంటే ఇబ్బందే. అందుకే ఎయిర్‌టెల్ సరికొత్త రీఛార్జ్ ప్లాన్ ప్రకటించింది. ఇది ఏడాది వ్యాలిడిటీతో వచ్సే ఛీప్ అండ్ బెస్ట్ ప్లాన్. ఎస్ఎంఎస్, అన్‌లిమిటెడ్ కాలింగ్ అన్నీ ఉంటాయి. డేటా ఒక్కటే తక్కువగా ఉంటుంది. ఏడాది వరకూ రీఛార్జ్ అవసరం లేదు.
ఎయిర్‌టెల్ కొత్తగా 1799 రూపాయల ఏడాది రీఛార్జ్ ప్లాన్ ప్రారంభించింది. ఈ ప్లాన్‌లో 365 రోజులు వ్యాలిడిటీ ఉంటుంది. అంటే రోజుకు కేవలం 5 రూపాయలు మాత్రమే. ఈ ప్లాన్‌లో రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు పంపించుకోవచ్చు. డేటా మాత్రం ఏడాది మొత్తానికి 24 జీబీ ఉంటుంది. అంటే నెలకు 2 జీబీ మాత్రమే. డేటా అయిపోతే అవసరాన్ని బట్టి డేటా టాప్ అప్ చేసుకోవచ్చు.
ఎయిర్‌టెల్ అందిస్తున్న 1799 రూపాయల ప్లాన్‌తో ఉచిత హెలో ట్యూన్స్, వింక్ మ్యూజిక్ యాప్ వంటి సేవలు ఉచితంగా అందుతాయి. ఫాస్టాగ్ లో 100 రూపాయలు క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంటుంది. ఒకేసారి 1799 రూపాయలు ఖర్చు పెట్టడం భారమైనా నెలనెలా రీఛార్జ్ లు లెక్కిస్తే ఇది చాలా ఛీప్ ప్లాన్. ఎందుకంటే ఇటీవల చాలామంది ఇంట్లో వైఫైనే ఉపయోగించుకుంటున్నారు. ఈ క్రమంలో డేటాతో పాటు ప్లాన్స్ తీసుకంటే వృధా అవుతోంది. ఈ ప్లాన్ తీసుకుంటే చాలా తక్కువ ధరలో ఏడాది వ్యాలిడిటీ పొందవచ్చు.
Also read: FD Interest Rate: సీనియర్ సిటిజన్లకు అత్యధికంగా 8.40 శాతం వడ్డీ చెల్లిస్తున్న బ్యాంకులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook