SBI Jobs: బ్యాంక్ అభ్యర్థులకు అలర్ట్..వెంటనే ఎస్‌బీఐ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి..!

SBI Jobs: బ్యాంకు ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా(SBI) కీలక సూచన జారీ చేసింది. దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపింది.

Written by - Alla Swamy | Last Updated : Sep 27, 2022, 02:50 PM IST
  • బ్యాంక్ అభ్యర్థులకు అలర్ట్
  • నేటితో దరఖాస్తు గడువు పూర్తి
  • కీలక సూచనలు
SBI Jobs: బ్యాంక్ అభ్యర్థులకు అలర్ట్..వెంటనే ఎస్‌బీఐ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి..!

SBI Jobs: ఇటీవల భారీగా ఉద్యోగాలను బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా(SBI) భర్తీ చేస్తోంది. బ్యాంక్‌లో 5 వేల 8 జూనియర్ అసోసియేషట్ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. 20 నుంచి 28 ఏళ్ల మధ్య గల యువతి యువకులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఈఏడాది నవంబర్‌లో జరగనుంది. https://www.sbi.co.in/ అధికారిక వెబ్ సైట్ దరఖాస్తు చేసుకోవాలని ఎస్‌బీఐ అధికారులు తెలిపారు.

* ఎస్‌బీఐలో 5008 జూనియర్ అసోసియేట్ పోస్టుల భర్తీ
* నేటితో దరఖాస్తు ప్రక్రియ ముగింపు
* వయోపరిమతి: వయస్సు 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి
* ప్రిలిమ్స్ ఎగ్జామ్: నవంబర్ 2022
* వెబ్‌సైట్: https://www.sbi.co.in/

ఇటీవల 1673 ప్రొబేషనరీ ఆఫీసర్(PO) పోస్టులకు ఎస్‌బీఐ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులకు అర్హత సాధించాలంటే డిగ్రీ చేసి ఉండాలని అధికారులు తెలిపారు. వయస్సు ఈఏడాది ఏప్రిల్ 1 నాటికి 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలని వెల్లడించారు. అక్టోబర్ 12 లోపు దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు. ఈఏడాది డిసెంబర్ 17 నుంచి 20 మధ్య ప్రిలిమ్స్ పరీక్ష ఉండనుంది. ఇందులో ఉత్తీర్ణత సాధించిన వారికి మెయిన్స్ పరీక్ష, ఇంటర్వ్యూ ఉంటుంది. మరిన్ని వివరాలు http://sbi.co.in/ వెబ్‌సైట్‌లో చూడవచ్చు. 

* ఎస్‌బీఐలో 1673 ప్రొబేషనరీ ఆఫీసర్(PO) పోస్టులు
* అర్హత: ఏదైనా డిగ్రీ
* వయస్సు: ఏప్రిల్ 1 2022 నాటికి 21-30 ఏళ్ల మధ్య ఉండాలి
* చివరి తేదీ: అక్టోబర్ 12లోపు దరఖాస్తు చేసుకోవాలి
* డిసెంబర్ 17-20 మధ్య ప్రిలిమ్స్ పరీక్ష
* పాస్ అయిన వారికి మెయిన్స్, ఇంటర్వ్యూ
* వెబ్ సైట్..http://sbi.co.in/ 

Also read:Rain Alert: తెలుగు రాష్ట్రాలకు ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్..లెటెస్ట్‌ వెదర్ రిపోర్ట్ ఇదే..!

Also read:America Accident: అమెరికాలో రోడ్ టెర్రర్..ముగ్గురు ఎన్నారైల దుర్మరణం..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News