Best Second Hand Hyundai Creta Cars: కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో హ్యుందాయ్ క్రెటాకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ఉన్న మారుతి వితారా బ్రెజా, ఫోర్డ్ ఎకోస్పోర్ట్, రెనో డస్టర్, టాటా నెక్సాన్ మరియు మహీంద్రా టియువి300లతో పోల్చుకుంటే.. హ్యుందాయ్ క్రెటాకు అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి. కొత్త క్రెటా కారుకే కాదు.. సెకండ్ హ్యాండ్ కార్లకు కూడా భారీగానే డిమాండ్ ఉంది. మంచి కారు అయితే రూ. పది లక్ష్యాలపైన ఉంటుంది. అయితే తక్కువ డబ్బులు ఉండి.. హ్యుందాయ్ క్రెటా కారు మీకు ఇష్టం అయితే అస్సలు చింతించాల్సిన అవసరం లేదు.
సెకండ్ హ్యాండ్ కార్ మార్కెట్‌లో కూడా హ్యుందాయ్ క్రెటాకు చాలా మంచి డిమాండ్ ఉంది. అయితే పాత కారును కొనుగోలు చేసినప్పుడు.. రిజిస్ట్రేషన్ చేయవలసిన అవసరం లేదు. అంతేకాదు రోడ్ టాక్స్ కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కార్స్ 24 వెబ్‌సైట్‌లో ఉన్న కొన్ని కార్లకు ఇప్పటికే రోడ్ టాక్స్ చెల్లించబడింది. నోయిడా, ఢిల్లీలో ఉండే వారికీ రిజిస్ట్రేషన్ కూడా అవసరం లేదు. కార్స్ 24 వెబ్‌సైట్‌లో ఉన్న హ్యుందాయ్ క్రెటా కార్లను ఓసారి చూద్దాం.
Hyundai Creta 1.6 S:
2015 హ్యుందాయ్ క్రెటా 1.6 ఎస్ మాన్యువల్ ధర రూ.7,42,000గా ఉంది. ఈ కారు పెట్రోల్ ఇంజన్‌తో 71,617 కిలోమీటర్లు నడిచింది. ఈ కారు మొదటి యజమాని నోయిడాలో అమ్మకానికి పెట్టాడు.
Hyundai Creta 1.6 S:
2016 హ్యుందాయ్ క్రెటా 1.6 S మాన్యువల్ రూ.7,58,000కు కార్స్ 24లో అందుబాటులో ఉంది. ఈ కారు పెట్రోల్ ఇంజన్‌తో 76,938 కిలోమీటర్లు నడిచింది. ఈ కారును మూడవ యజమాని నోయిడాలో అమ్మకానికి పెట్టాడు.
Hyundai Creta 1.6 SX (O) CRDI:
2015 హ్యుందాయ్ క్రెటా 1.6 SX (O) CRDI మాన్యువల్ కారు ధర రూ.7,72,000గా ఉంది. ఈ కారు డీజిల్ ఇంజిన్‌తో 56,170 కిలోమీటర్లు నడిచింది. ఈ కారును మొదటి యజమాని నోయిడాలో అమ్మకానికి ఉంచాడు.
Hyundai Creta 1.4 E PLUS CRDI:
2017 హ్యుందాయ్ క్రెటా 1.4 E ప్లస్ CRDI మాన్యువల్ కార్స్ 24లో అమ్మకానికి ఉంది. దీని ధర రూ.8,16,000. ఈ కారు 43,016 కిలోమీటర్లు ప్రయాణించింది. ఈ కారు డీజిల్ ఇంజిన్‌తో నడుస్తుంది. ఈ కారు మొదటి యజమాని నోయిడాలో మాత్రమే అమ్మకానికి ఉంచాడు.
Also Read: Rishabh Pant Accident: ప్రమాదానికి గురైన రిషబ్ పంత్ కారు భద్రతా ఫీచర్లు ఇవే.. ధర కోటి కంటే ఎక్కువ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.