Best Upcoming Bikes In March 2024: మార్చి నెలలో లాంచ్‌ కాబోతున్న బైక్‌లు ఇవే..ఫీచర్స్‌, స్పెఫికేషన్స్‌ ఫుల్ డిటెయిల్స్‌!

Best Upcoming Bikes In March 2024 In Budget: మార్చి నెలలో ప్రముఖ ఆటో మొబైల్‌ కంపెనీలకు సంబంధించిన మోటర్‌ సైకిల్స్‌ విడుదల కాబోతున్నాయి. అయితే మొదటి వారంలో హీరో Xoom 160, బజాజ్ పల్సర్ N400 లాంచ్‌ అయ్యే ఛాన్స్‌ ఉందని సమాచారం. ఇవే కాకుండా చాలా కంపెనీకు సంబంధించిన బైక్‌ లాంచ్‌ కాబోతున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకోండి.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 22, 2024, 12:29 PM IST
Best Upcoming Bikes In March 2024: మార్చి నెలలో లాంచ్‌ కాబోతున్న బైక్‌లు ఇవే..ఫీచర్స్‌, స్పెఫికేషన్స్‌ ఫుల్ డిటెయిల్స్‌!

Best Upcoming Bikes In March 2024 In Budget Telugu: ప్రముఖ ఆటో మొబైల్‌ కంపెనీల నుంచి 2024 సంవత్సరంలోని మార్చి నెలలో అనేక మోటర్‌ సైకిల్స్‌ లాంచ్‌ కాబోతున్నాయి. ఇప్పటికే కొన్ని కంపెనీలు అధికారంగా విడుదల తేదిని ప్రకటించాయి. హీరో, బజాజ్‌ కంపెనీలకు సంబంధించిన కొన్ని బైక్స్‌ ఫిబ్రవరి చివరి వారంలోనే లాంచ్‌ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే లక్ష లోపు మార్చి నెలలో విడుదలయ్యే మోటర్‌ సైకిల్స్‌ ఏంటో..వాటి ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ తెలుసుకోండి. 

మార్చి 2024లో విడుదలయ్యే కొత్త బైక్‌ల వివరాలు:
హీరో Xoom 160: 

ఈ హీరో Xoom 160 బైక్‌ని కంపెనీ ఫిబ్రవరి చివరి వారంలోనే విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ అధికారిక సమాచారం ప్రకారం, ఇది మార్చి మొదటి వారంలో లాంచ్‌ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మోటర్‌ సైకిల్‌  కొత్త స్పోర్ట్స్‌ లుక్‌లో 160cc BS6 ఇంజన్‌ను కలిగి ఉంటుంది.  దీని ధర రూ.1.10 లక్ష నుంచి రూ.1.20 లక్షల మధ్య ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 

బజాజ్ పల్సర్ N400: 
బజాజ్ కంపెనీ పల్సర్ N400 మోటర్‌ సైకిల్‌ను 400cc ఇంజన్‌తో మార్కెట్‌లోకి విడుదల చేయబోతున్నట్లు తెలిపింది. ఇది పల్సర్ RS200,  NS200లకు సక్సెసర్‌గా లాంచ్‌ కాబోతున్నట్లు సమాచారం. దీని ధర రూ.2.00 లక్ష నుంచి రూ.2.10 లక్షల మధ్య ఉండే ఛాన్స్‌ ఉంది. అయితే బజాజ్‌ ఈ బైక్‌ని మార్చి రెండవ వారంలో లాంచ్‌ చేసే ఛాన్స్‌ ఉంది. 

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350: 
ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ రాయల్ ఎన్‌ఫీల్డ్‌ను 350cc ఇంజన్‌తో లాంచ్‌ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇది  క్లాసిక్ 350, హిమాలయాలకు సక్సెసర్‌గా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోది. అయితే ఈ బైక్‌ ధర వివరాల్లోకి వెళితే రూ.2.00 లక్ష నుంచి రూ.2.20 లక్షల మధ్య ఉండే అవకాశాలు ఉండబోతున్నట్లు సమాచారం. 

రాయల్ ఎన్‌ఫీల్డ్ రోడ్‌స్టర్ 450: 
ఈ మోటర్‌ సైకిల్‌ 450ccతో మార్కెట్‌లోకి లాంచ్‌ కాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా దీనిని కంపెనీ స్పోర్ట్స్ బైక్‌గా అందుబాటులోకి తీసుకు రాబోతోన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ రోడ్‌స్టర్ 450 బైక్‌ ఎన్నో శక్తివంతమై ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ను కలిగి ఉంటుంది. ఇక ధర విషయానికొస్తే..రూ.2.40 లక్ష నుంచి రూ.2.60 లక్షల మధ్య ఉండే అవకాశాలు ఉన్నాయి. 

Also Read Ibomma Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

హోండా CB350RS: 
ప్రముఖ మోటర్‌ సైకిల్ తయారీ కంపెనీ హోండా విడుదల చేయబోయే CB350RS బైక్‌ 350ccతో రాబోతున్నట్లు సమాచారం. అంతేకాకుండా విడుదలకు ముందే ఈ బైక్‌కి సంబంధించిన ఫీచర్స్‌, ధర సోషల్‌ మీడియాలో లీక్‌ అయ్యాయి. లీక్‌ అయిన వివరాల ప్రకారం..దీని ధర రూ.2.10 లక్ష నుంచి రూ.2.30 లక్షల మధ్య ఉండే ఛాన్స్‌ ఉందని తెలుస్తోంది. 

KTM 125 డ్యూక్: 
కెటిఎం నుంచి కూడా కొత్త స్టోర్ట్స్‌ బైక్‌ విడుదల కాబోతోంది. కంపెనీ దీనిని మార్చి మూడవ వారంలో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఈ బైక్‌కి సంబంధించిన ఫీచర్స్‌ కూడా సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇది 125cc ఇంజన్‌తో రాబోతున్నట్లు తెలుస్తోంది. దీని ధర రూ.1.75 లక్ష నుంచి రూ.1.80 లక్షల మధ్య ఉండొచ్చు. 

Also Read Ibomma: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News