BMW New Model Car: బీఎండబ్ల్యూ. సూపర్ లగ్జరియన్ హైటెక్ కార్లలో నెంబర్‌వన్ బ్రాండ్. ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ల శకం నడుస్తుండటంతో బీఎండబ్ల్యూ సరికొత్త మోడల్ మార్కెట్‌లో ప్రవేశపెట్టబోతోంది. ఆ మోడల్ చూస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. ఈ కారులో కొన్ని ప్రత్యేకతలున్నాయి..అవేంటో తెలుసుకుందామా
బీఎండబ్ల్యూ(BMW)సంస్థ సరికొత్త మోడల్ కారును మార్కెట్‌లో ప్రవేశపడుతోంది. ప్రస్తుతం అంతా ఎలక్ట్రిక్ కార్ల యుగం నడుస్తుండటంతో బీఎండబ్ల్యూ కూడా అదే రంగంలో వస్తోంది. అంతేకాదు సర్క్యులర్ పేరుతో కొత్త కారును తీసుకొస్తోంది. ఇప్పటికే ఈ కారు నమూనాను జర్మనీలోని మ్యూనిక్‌లో జరుగుతున్నంత మొబిలిటీ షోలో ప్రదర్శించారు. కచ్చితంగా ఈ కారును ఆటోమొబైల్ ఇండస్ట్రీలో విప్లవాత్మక మార్పులు రానున్నాయనేది మార్కెట్ విశ్లేషకుల అంచనా.
ఈ కారు మిగిలిన కార్ల కంటే చాలా భిన్నమైంది. బీఎండబ్ల్యూ సంస్థ సర్క్యులర్ (BMW Circular Car)కారును రీ సైకిల్డ్ మెటీరియల్ తయారు చేశారు. కారు లైఫ్‌టైమ్ ముగిసిన తరువాత కూడా కారులోని భాగాల్ని రీసైకిల్ చేసి...కొత్త కార్లలో ఉపయోగించవచ్చు.కారు బాడీని ఐనోడైజ్డ్ అల్యూమినియంతో తయారు చేశారు. ఇంటీరియల్ క్యాబిన్ భాగాన్ని రీ సైకిల్డ్ ప్లాస్టిక్‌తో రూపొందించారు. బ్యాటరీ కూడా రీసైకిల్డ్ కావడం విశేషం. కారు డిజైన్ విషయంలో చాలా ఆకర్షిణీయంగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం బీఎండబ్ల్యూ తయారు చేస్తున్న వాహనాల్లో 30 శాతం మేర పునర్నిర్మాణం సామగ్రి వాడుతున్నారు. 2040 నాటికి వాహనాలన్నింటినీ వందశాతం రీ సైకిల్డ్ మెటీరియల్‌తోనే కావడం మరో ప్రత్యేకత. బీఎండబ్ల్యూ అంటేనే లగ్జరీ కార్లకు పేరు. మార్కెట్‌లోకి కచ్చితంగా ఎప్పుడు తీసుకొస్తుందనే విషయం ఆసక్తిగా మారింది. బీఎండబ్ల్యూ (BMW Electric Car)తీసుకొస్తున్న ఈ కారు మాత్రం మార్కెట్‌లో ఓ సంచలనం కాబోతుందని సమాచారం.
Also read: Cairn Energies Dispute: ఇండియా- కెయిర్న్ ఎనర్జీస్ సంస్థల మధ్య వివాదం పరిష్కారం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook