ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అత్యంత ఆకర్షణీయమైన, విభిన్నమైన ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేస్తోంది. జూలై 24న ఇండియాలో లాంచ్ చేసేందుకు BMW Motorrad India సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఈ స్కూటర్ కోసం ప్రీ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. దేశంలో అందుబాటులో ఉన్న స్కూటర్లలో అత్యంత ఖరీదైంది ఇదే కానుంది.
అత్యాధునిక టెక్నాలజీతో , అద్దిరిపోయే లుక్‌తో, విభిన్నమైన డిజైన్‌తో బ్రాండ్ ప్రత్యేకత నిలబెట్టుకుంటూ BMW CE 04 స్కూటర్ లాంచ్ అవుతోంది. ఇందులో లిక్విడ్ కూల్డ్ పర్మనెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటార్ ఉంటుంది. ఇది 19.7 బీహెచ్‌పి పవర్, 61 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ స్కూటర్ గరిష్ట వేగం 120 కిలోమీటర్లు. ఒకసారి ఛార్జ్ చేస్తే 130 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. జీరో నుంచి 100 శాతం ఛార్జింగ్‌కు 4 గంటల 20 నిమిషాల సమయం పడుతుంది. 80 శాతం ఛార్జ్ అయ్యేందుకు మూడున్నర గంటల సమయం పడుతుంది. స్మార్ట్ ఫోన్లలానే ఫాస్ట్ ఛార్జర్ డివైస్ ఉపయోగిస్తే 1 గంట 40 నిమిషాల్లోనే పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు.
BMW CE 04 పూర్తిగా ఎల్ఈడీ లైటింగ్‌తో ఉంటుంది. ఇందులో 10.25 అంగుళాల టీఎఫ్టీ కలర్ స్క్రీన్ నావిగేషన్ అండ్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. ఇక ఈ స్కూటర్ ఫీచర్లు చూస్తే ఎలక్ట్రానిక్ రివర్స్ ఫంక్షన్, ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్, టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ ఉన్నాయి. స్కూటర్ బాడీ కింది భాగంలో సింగిల్ సైడ్ స్వింగ్ ఆర్క్, వెనుక హింగ్డ్ సస్పెన్షన్, ముందు వైపు సింగిల్ బ్రిడ్జి టెలిస్కోపిక్ ఫోర్క్ ఉంటాయి. జూలై 24న BMW CE 04తో పాటు బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా 5 సిరీస్ ఎల్ డబ్ల్యూడి, మినీ కూపర్ ఎస్, మినీ కంట్రీమ్యాన్ ఎలక్ట్రిక్ వాహనాల్ని కూడా విడుదల చేయనుంది. BMW CE 04లో రోడ్ ,రైన్, ఎకో మూడు మోడ్స్ ఉన్నాయి. ఈ స్కూటర్ ధర ఎంతనేది కంపెనీ ఇంకా ప్రకటించలేదు.
Also read: 8th Pay Commisson: ఉద్యోగుల పంట పండినట్టే, 8 వేతన సంఘం, కోవిడ్ బకాయిలపై బడ్జెట్‌లో ప్రకటన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook