Apply Voter ID Card: ఎన్నికల సంఘం ఓటరు ఐడీ కార్డు విషయంలో కీలక సూచనలు జారీ చేసింది. ఓటరు ఐడీ కార్డు కావాలన్నా లేక మీ ఓటరు ఐడీ కార్డులో ఏదైనా మార్పులు చేయాలన్నా పెద్ద కష్టమేం కాదు. ఆన్‌లైన్‌లో ఇంట్లో కూర్చునే చాలా సులభంగా చేయవచ్చు.
దేశంలో ఈసారి 1.82 కోట్ల మంది తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ఓటు హక్కు లభించి ఓటరు ఐడీ కార్డు లేకపోతే వెంటనే అప్లై చేయండి. ఓటరు ఐడీ కార్డు ఉంటే ఓటు వేసేటప్పుడు ఎలాంటి ఇబ్బంది తలెత్తదు. దేశంలో 18 ఏళ్లు దాటినవారికి ఓటు హక్కు లభిస్తుంది. ఓటరు ఐడీ కార్డు అనేది కేవలం ఓటు వేసేందుకే కాకుండా ఇంకా చాలా పనులకు కీలకమైన ఐడీ కార్డుగా, సిటిజన్‌షిప్ గుర్తింపు కార్డుగా ఉపయోగపడుతుంది. ఇంట్లో కూర్చుని ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం.
ఓటరు ఐడీ కార్డు కోసం ఎలా అప్లై చేయాలి
ఓటరు ఐడీ కార్డు కోసం అప్లై చేసేందుకు ముందుగా ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్ https://voters.eci.gov.in.ఓపెన్ చేయాలి. ఇప్పుడు మీ ఫోన్ నెంబర్ సహాయంతో ఓటీపీ ధృవీకరించుకుని ఐడీ క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు రిజిస్టర్ యాజ్ న్యూ వోటర్ ఫామ్ 6 క్లిక్ చేయాలి. అక్కడ అడిగిన సమాచారాన్ని ఫిల్ చేసి ఫోటో అప్‌లోడ్ చేయాలి. ఇంట్లో ఎవరో ఒకరి ఓటరు కార్డు నెంబర్ ఎంటర్ చేయాలి. అడ్రస్ ప్రూఫ్ కోసం ఆధార్ అప్‌లోడ్ చేసి సబ్మిట్ చేయాలి. మీకొక అప్లికేషన్ ఐడీ వస్తుంది. ఆ ఐడీ ఆధారంగా స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.
అప్లై చేసిన వారం రోజుల తరువాత అప్లికేషన్ ఐడీ ఆధారంగా స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఐడీ కార్డు సిద్ధమై ఉంటే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కొన్నిరోజుల్లో మీ ఓటరు ఐడీ కార్డు మీ చిరునామాకు పోస్ట్ ద్వారా అందుతుంది.
Also read: Passport Tips: ఇలా అప్లై చేస్తే కేవలం 5 రోజుల్లోనే పాస్‌పోర్ట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook