EPFO Good News For PF Subscribers: ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త, 3 రోజుల్లో క్లెయిమ్ సెటిల్మెంట్ చేస్తున్న EPFO

EPFO Good news for PF subscribers: కరోనా మహమ్మారికి చికిత్స అందించడానికి, ఉద్యోగాలు కోల్పోయిన వారికి ఈ కష్టకాలంలో ఆర్థికంగా తోడ్పాడు అందించేందుకు ఈపీఎఫ్‌వో తన వంతు సహాయం అందిస్తోంది. ఈ క్రమంలో కోవిడ్19 అడ్వాన్స్ క్లెయిమ్ చేసుకున్న వారికి కేవలం 3 రోజుల్లోనే నగదు చేతికి అందించాలని నిర్ణయం తీసుకుని ఊరట కలిగించింది.

Written by - Shankar Dukanam | Last Updated : Jun 2, 2021, 11:10 AM IST
EPFO Good News For PF Subscribers: ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త, 3 రోజుల్లో క్లెయిమ్ సెటిల్మెంట్ చేస్తున్న EPFO

EPFO Good news for PF subscribers: కరోనా వ్యాప్తి సమయంలో తన ఖాతాదారులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO), కేంద్ర ప్రభుత్వం తమ వంతు సహకారాన్ని అందిస్తున్నాయి. ఆరు కోట్లకు పైగా ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు ఈపీఎఫ్ ఖాతాలున్నాయి. వీరికి కోవిడ్19 అడ్వాన్స్‌గా నగదు విత్‌డ్రా చేసుకునే వెసలుబాటు కల్పించారు.

కుటుంబసభ్యులకు కరోనా మహమ్మారికి చికిత్స అందించడానికి, ఉద్యోగాలు కోల్పోయిన వారికి ఈ కష్టకాలంలో ఆర్థికంగా తోడ్పాడు అందించేందుకు ఈపీఎఫ్‌వో తన వంతు సహాయం అందిస్తోంది. ఈ క్రమంలో కోవిడ్19 అడ్వాన్స్ క్లెయిమ్ చేసుకున్న వారికి కేవలం 3 రోజుల్లోనే నగదు చేతికి అందించాలని నిర్ణయం తీసుకుని ఈపీఎఫ్ ఖాతాదారుల (EPF Subscribers)కు ఊరట కలిగించింది. మాన్యువల్‌గా పని అంత తేలికగా పూర్తికాదని భావించిన ఈపీఎఫ్‌వో ఇందుకోసం ఆటో క్లెయిమ్ సెటిల్మెంట్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించింది.

Also Read: EPFO: జీతం నుంచి నెలవారీ EPF ఎంత కట్ అవుతుంది, వడ్డీ వివరాలు చెక్ చేసుకోండి

అయితే కేవైసీ పూర్తి చేసుకున్న ఈపీఎఫ్ ఖాతాదారులకు మాత్రమే ఈ అవకాశాన్ని కల్పించింది. గతంలో 20 రోజులు పట్టే సమయాన్ని ప్రస్తుతం 3 రోజుల్లోనే ఈపీఎఫ్ ఖాతాదారులకు కోవిడ్19 అడ్వాన్స్ అందించడం గమనార్హం. తమ ఖాతాదారులకు ఆర్థిక సమస్య తొలగించడంలో భాగంగా ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఈపీఎఫ్‌వో (EPFO Latest News) ఓ ప్రకటనలో తెలిపింది. ఇది సెకండ్ నాన్ రిఫండబుల్ కోవిడ్-19 అడ్వాన్స్ కావడం గమనార్హం. రూ.15,000 అంతకన్నా తర్కువ వేతనం అందుకుంటున్న ఉద్యోగులకు దీని ద్వారా ప్రయోజనం చేకూరుతుంది.

గత ఏడాది కరోనా వైరస్ వ్యాప్తి మొదలైన సమయం నుంచి నేటి వరకు 76.31 లక్షల కోవిడ్-19 అడ్వాన్స్ దరఖాస్తులకు ఈఫీఎఫ్‌వో సెటిల్మెంట్ చేసింది. ఇందులో భాగంగా రూ.18,698.15 కోట్లను ఈపీఎఫ్ ఖాతాదారులకు అందించినట్లు సమాచారం. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన (Pradhan Mantri Garib Kalyan Yojana) కింద గత ఏడాది మార్చిలో ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ, ఈపీఎఫ్‌వో కొన్ని సవరణలు చేసి ఈపీఎఫ్ (EPF Benefits) ఖాతాదారులకు ఆర్థిక చేయూత అందిస్తున్నాయి.

Also Read: 5 Rules Changing From June 1: ఈపీఎఫ్ Aadhaar లింకింగ్ సహా జూన్ 1 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News