EPF Interest Rate: పీఎఫ్ ఉద్యోగులకు నిరాశ కల్గించే వార్త. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల పీఎప్ ఎక్కౌంట్లపై వడ్డీ రేట్లను భారీగా తగ్గించింది. ఫలితంగా ఉద్యోగులు నష్టం ఎదుర్కోనున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
ప్రతి యేటా ఆర్ధిక సంవత్సరం చివరిలో అంటే మార్చ్-ఏప్రిల్ మధ్య కాలంలో సీబీటీ సమావేశంలో వడ్డీరేట్లు నిర్ణయిస్తారు. సీబీటీ ప్రతిపాదనను ఆర్ధిక మంత్రిత్వ శాఖ ఆమోదించి నిర్ణయం తీసుకుంటుంది. ఈసారి అంటే 2021-22 ఏడాదికి సంబంధించిన వడ్డీరేట్లపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వడ్డీరేట్లు భారీగా తగ్గించింది. గత ఏడాది 8.50గా ఉన్న వడ్డీరేటును ఈ ఏడాది ఏకంగా 0.40 శాతం తగ్గించేసింది. అంటే 8.10 శాతంగా నిర్ణయించింది. ఫలితంగా ఉద్యోగులకు భారీ వడ్డీ నష్టం కలగనుంది.
1972లో ఈపీఎఫ్ వడ్డీ రేటు 7 శాతముండగా..ఆ తరువాత క్రమంగా పెరుగుతూ పోయింది. 1989-1999 మధ్యకాలంలో అయితే పీక్స్‌కు చేరింది. ఏకంగా 12 శాతం వడ్డీ లభించేది. ఆ తరువాత తగ్గుతూ వస్తోంది. గత ఏడేళ్లుగా ఈపీఎఫ్‌పై వడ్డీ రేటు 8.50 శాతం లేదా అంతకంటే తక్కువే ఉంటోంది. ఈసారి అది మరింత తగ్గి..8.10 శాతానికి చేరుకుంది. గత 40 ఏళ్ల ఈపీఎఫ్ చరిత్రలో ఇదే అతి తక్కువ వడ్డీరేటుగా ఉంది.
Also read: Flipkart Smart TV Offers: ఫ్లిప్‌కార్ట్ ఆఫర్.. రూ.59 విలువ చేసే ఎల్జీ స్మార్ట్ టీవీ కేవలం రూ.21,990కే...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook