Gold Price Today January 5 2022 : బంగారం అంటే భారతీయులకు ఒక సెంటిమెంట్. కొంత డబ్బు కూడబెట్టగానే చాలామంది బంగారం కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపుతారు. ఇక పెళ్లిళ్లు, ఇతరత్రా శుభకార్యాల్లో బంగారానికే పెద్ద పీట వేస్తారు. బంగారం ధర ఎప్పటికప్పుడు పెరిగే అవకాశం ఉండటంతో.. దాన్నొక పెట్టుబడిగా భావిస్తుంటారు. అందుకే సామాన్యులు మొదలు ఉన్నత వర్గాల వరకూ ఎప్పటికప్పుడు బంగారం ధరలను గమనిస్తూ ఉంటారు. ఇవాళ దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం...
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు:
హైదరాబాద్ మార్కెట్‌లో ఇవాళ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,900గా ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.350 మేర ధర తగ్గింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,990గా ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.370 మేర ధర తగ్గింది.
విజయవాడలో ఇవాళ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,900గా ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.350 మేర ధర తగ్గింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,990గా ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.370 మేర ధర తగ్గింది.
దేశంలోని ఇతర నగరాల్లో బంగారం ధరలు:
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,050 ఉండగా, అదే 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,330గా ఉంది.
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,260
ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,260గా ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,170 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,230గా ఉంది.
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,800గా ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,990గా ఉంది.
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,990గా ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.