Cardless Cash Withdrawal: భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) ఈ నెల ఆరంభంలో నిర్వహించిన మానిటరీ పాలసీ కమిటి (ఎంపీసీ) సమీక్షలో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో ముఖ్యమైంది ఏటీఎంల ద్వారా డెబిట్ కార్డు లేకుండా నగదు విత్‌డ్రా చేసుకునే సదుపాయం. అన్ని బ్యాంకుల ఏటీఎంలలో అందుబాటులోకి రానుందని ఆర్బీఐ చేసిన ఈ ప్రకటనపై ఇప్పుడు సర్వత్రా చర్చ సాగుతోంది.
ఏటీఎంలలో డెబిట్ కార్డు లేకున్నా నదు తీసుకోవచ్చని చెప్పినప్పటికీ.. ఇందుకు సంబంధించిన నియమ నిబంధనలను మాత్రం ఆర్బీఐ వెల్లడించలేదు. అయితే కార్డ్ లెస్ విత్‌డ్రా వ్యవస్థ ఎలా పని చేస్తుంనే విషయంపై ప్రస్తుతం వివిధ అంచనాలు ఉన్నాయి. అందులో రెండు ముఖ్యమైన విధానాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మొదటి విధానం..
ఈ విధానంలో ఏటీఎంలో ఉండే కంప్యూటర్ స్కీన్‌పైన కార్డ్‌లెస్ విత్‌డ్రా ఆప్షన్ కనిపించనుంది. దానిని ఎంచుకుంటే.. ఓ క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది.
ఆ క్యూఆర్ కోడ్‌ను మీ మొబైల్లో ఉండే యూపీఐ పేమెంట్ యాప్‌ల ద్వారా స్కాన్ చేయాలి.
ఆ తర్వాత మీకు ఎంత నగదు అవసరమో ఆ మొత్తాన్ని ఎంటర్ చేసి.. యూపీఐ పిన్ ఎంటర్ చేయాలి. పేమెంట్ పూర్తయిన వెంటనే ఏటీఎం నుంచి డబ్బులు వస్తాయి.
రెండో విధానం..
ఈ విధానంలో కూడా యూపీఐ ఆధారిత విత్‌డ్రా విధానం అమలులోకి వస్తే.. ఏటీఎం హోం స్క్రీన్‌పై ఈ ఆప్షన్ కనిపిస్తుంది.
ఈ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకుని.. అందులో మీ యూపీఐ ఐడీని ఎంటర్ చేయాలి. తర్వాతి విండోలో ఎంత మొత్తం విత్‌డ్రా చేసుకోవాలో ఆ నగదును ఎంటర్ చేయాలి. అప్పుడు మీ యూపీఐ యాప్‌కు ఓ రిక్వెస్ట్ వస్తుంది. ఆ రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్ చేసి.. పిన్ ఎంటర్ చేయగానే డబ్బులు విత్‌డ్రా అవుతాయి.
నోట్: ఈ రెండు విధానాలు ప్రస్తుతం అధికంగా ప్రచారంలో ఉన్నవి మాత్రమే. ఆర్బీఐ త్వరలోనే అధికారికంగా కార్డ్‌లెస్ విత్‌డ్రాలకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేయనుంది.
ఇటీవలి కాలంలో పెరిగిన డిజిటల్ లావాదేవీల నేపథ్యంలో సైబర్ నేరాలు కాడా భారీగా పెరిగాయి. అదే విధంగా క్లోన్ ఏటీఎం కార్డుల ద్వారా కూడా కొంత మంది మోసాలకు పాల్పడుతున్నారు. ఈ మోసాలకు చెక్ పెట్టే దిశగా ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
Also read: Mahesh Babu: ఎలక్ట్రిక్ కారు కొన్న మహేశ్ బాబు.. స్వయంగా అందించిన ఆడి అధినేత
Also read: Flipkart Smart TV Offers: రూ.41 వేల విలువైన 50 అంగుళాల స్మార్ట్ టీవీని రూ.9 వేలకే కొనొచ్చు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook