Independence Day 2023: స్వతంత్ర భారతావనిలో టాప్ 10 కార్లు, బైకులు

Independence Day 2023: ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఎదిగే క్రమంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురయ్యాయి. అటు ఫోర్ వీలర్స్‌లో అయినా.. ఇటు టూ వీలర్స్‌లో అయినా ఎన్నో ఒడిదుడుకులు ఎదురయ్యాయి. ఎన్నో మోడల్స్ కాలగర్భంలో కలిసిపోయాయి కానీ కొన్ని మోడల్స్ మాత్రం కస్టమర్స్ మనసు దోచుకోవడమే కాకుండా ఆయా కంపెనీల ఎదుగుదలలోనూ కీలక పాత్ర పోషించాయి

Written by - Pavan | Last Updated : Aug 14, 2023, 06:29 PM IST
Independence Day 2023: స్వతంత్ర భారతావనిలో టాప్ 10 కార్లు, బైకులు

Independence Day 2023: ఇండియాకు స్వాతంత్య్రం వచ్చిందని సంబరాలు జరుపుకుంటున్నాం కదా.. ఈ సంబరాల వెనుక ఎంతో మంది స్వాతంత్య్ర సమరయోధులు, అమరవీరుల త్యాగాలు ఎలాగైతే ఉన్నాయో.. అలాగే మన స్వతంత్ర భారత దేశం ఆర్థికంగా ప్రగతి సాధించడంలోనూ ఎన్నో రంగాల్లో ఎంతోమంది వ్యాపారవేత్తలు, ఎన్నో కంపెనీల కృషి ఉంది. అంతేకాదు.. కొన్నిరంగాల్లో మన ఇండిపెండెంట్ ఇండియా ప్రపంచదేశాలకు గట్టి పోటీని ఇస్తూ వరల్డ్ నెంబర్ 1 పోజిషన్ కోసం తహతహలాడుతోంది. ఉదాహరణకు ఇండియన్ ఆటో మొబైల్ ఇండస్ట్రీ కూడా అందులో ఒకటి. రవాణా వ్యవస్థే సరిగ్గా లేని రోజుల నుంచి, కాలి నడక, ఎడ్ల బండ్ల నుండి మొదలైన ప్రయాణం ఇవాళ ప్రపంచదేశాలు భారత్ వైపు చూసే స్థాయికి ఎదిగింది. ప్రస్తుతం మన దేశం ఆటోమొబైల్ ఇండస్ట్రీ ప్రపంచంలోనే అతి పెద్ద మూడో ఇండస్ట్రీగా అవతరించింది. 

ఇలా ఎదిగే క్రమంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురయ్యాయి. అటు ఫోర్ వీలర్స్‌లో అయినా.. ఇటు టూ వీలర్స్‌లో అయినా ఎన్నో ఒడిదుడుకులు ఎదురయ్యాయి. ఎన్నో మోడల్స్ కాలగర్భంలో కలిసిపోయాయి కానీ కొన్ని మోడల్స్ మాత్రం కస్టమర్స్ మనసు దోచుకోవడమే కాకుండా ఆయా కంపెనీల ఎదుగుదలలోనూ కీలక పాత్ర పోషించాయి. అంతేకాకుండా దేశంలో ఆటోమొబైల్ రంగం అభివృద్ధికి కారణం అయ్యాయి. అవి ఏంటనేదే ఇప్పుడు తెలుసుకుందాం.

హిందుస్థాన్ అంబాసిడర్ కారు : 
1957 లో హిందుస్థాన్ అంబాసిడర్ కారు తొలిసారిగా లాంచ్ అయింది. స్వాతంత్ర్యం అనంతరం మన దేశంలో రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, ఇతర రంగాల ప్రముఖులకు కదిలే కలల సౌధం అంబాసిడర్ కారు. అంబాసిడర్ కారు ఉంటే ఆ లెవెలే వేరు అనే భావన నుంచి మొదలైన వ్యాపారం అనతికాలంలోనే నెంబర్ 1 అన్పించుకుంది. 
 
మారుతి 800 : 
దేశంలో సొంత కారు కొనుగోలు చేయలనకున్న ఎంతోమంది కలలు నిజం చేసిన కారు ఇది. ఇటీవలే మారుతి సుజుకి అధికారికంగా వెల్లడించిన సమాచారం ప్రకారం 45 లక్షల మారుతి సుజుకి 800 కార్లు విక్రయించారు. ఈ కారుకి ఎంత క్రేజ్ ఉందో.. ఇండియాలో ఆటోమొబైల్ రంగం ఎదుగుదలలో ఈ కారు ఎంత కీలక పాత్ర పోషించిందో ఈ సేల్స్ నెంబర్ చూస్తే అర్థం అవుతోంది.

మహింద్రా ఎంఎం 540 : 
స్కార్పియోలు, అంతకంటే ముందు సుమోలు రాజ్యమేలడాని కంటే ముందుగా తొలి తరం చూసిన SUV వాహనం ఏదైనా ఉందా అంట ఇదే. ఔను మహింద్రా ఎంఎం 540 ప్యాసింజర్ మొబిలిటీ కేటగిరీలో ఒకప్పుడు ఎంతో విరివిగా ఉపయోగించిన వాహనం. 

మారుతి ఓమ్నీ వాహనం :
ఇండియాలో తొలి తరం MPV వాహనంగా మారుతి ఓమ్నికి పేరుంది. ఐదుగురు ఎంతో సౌకర్యంగా ప్రయాణించేందుకు ఈ వాహనం ఉపయోగకరంగా ఉండటంతో దేశంలో ఎన్నో కుటుంబాలు తమ కుటుంబ అవసరాల కోసం ఈ వాహనం కొనుగోలు చేస్తుండేవి.

మారుతి జిప్సీ :
ఇండియాలో మొట్టమొదటి లైఫ్ స్టైల్ SUV వాహనంగా మారుతి జిప్సీకి పేరుంది. ఇండియన్ ఆర్మీతో పాటు దేశం నలుమూలలా ఈ వాహనాలను పోలీసులు కూడా ఉపయోగించే వారు. మారుతి జిప్సీకి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటే.. ఇప్పటికీ ఏవైనా పాత వాహనాలు ఎవరైనా విక్రయిస్తే.. వాటిని మరమ్మతులు చేసుకుని కొత్త వాహనంలా తయారు చేసి వినియోగించే వారు ఉన్నారు. 

రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 :
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350.. 1949 లో తొలిసారిగా మన భారతీయులకు పరిచయమైన రాయల్ బైక్ ఇది. జమిందార్లు, భూస్వాములు, బాగా డబ్బున్న ధనికులు ఇష్టపడి కొనుగోలు చేసిన వాటిలో ఇది కూడా ఒకటి. మారుతున్న కాలానికి అనుగుణంగా ఇందులో ఎన్నో మోడల్స్ రావడం, మధ్య తరగతి వారికి కూడా ధరలు అందుబాటులోకి రావడంతో ఎంతో క్రేజ్ ఉన్న టూ వీలర్ ప్రోడక్టుగా ఎదిగింది. 

యమహా RX100 :
ఇండియాలో యమహా RX100 బైక్ 1985 లో లాంచ్ అయింది. 2 స్ట్రోక్ ఇంజన్ తో విభిన్నమైన ఇంజన్ శబ్ధంతో వచ్చిన ఈ బైక్ యువతను ఎంతో ఆకట్టుకుంది. 

హీరో స్ప్లెండర్ బైక్ :
1994 లో తొలిసారిగా లాంచ్ అయిన హీరో స్ప్లెండర్ బైక్ ఇన్నేళ్ల తరువాత కూడా ఇప్పటికీ అత్యధికంగా అమ్ముడుపోయే బైకుగానే రికార్డు సొంతం చేసుకుంది. రాబోయే ఇంకొన్నేళ్ల వరకు ఈ రేసులో తమకు ఎవరూ పోటీ లేరంటోంది ఆ కంపెనీ,

హీరో హోండా కరిజ్మా : 
2003 ఇండియన్స్ కి కనిపించిన మొట్టమొదటి బిగ్ పర్ ఫార్మెన్స్ బైక్ హీరో హోండా కరిజ్మా ఆర్. 223 CC ఇంజన్ కెపాసిటీతో వచ్చిన ఈ బైకుపై ఇండియన్ యూత్ ఎంతో మోజుపడింది. వేగంగా దూసుకుపోవాలనుకునే యువతకి ఇదొక మంచి ఆప్షన్ అయింది. 

ఇది కూడా చదవండి : Tata Electric Cars: 1 లక్ష ఎలక్ట్రిక్ కార్లు అమ్మిన టాటా మోటార్స్‌.. ఎలాగంటే..

బజాజ్ పల్సర్ :
ఇండియాలో ఎక్కువగా అమ్ముడైన బైక్ ఇది. 2001 లో మన ముందుకొచ్చిన బజాజ్ పల్సర్ మొదట్లో 150CC , 180CC వేరియంట్స్ లో లాంచ్ అయింది. ఆ తరువాత 200CC , 220 CC వేరియంట్స్ కూడా లాంచ్ అయ్యాయి. 

ద్విచక్ర వాహనాలు అయినా.. కార్లలో అయినా ఇప్పుడు మనం చెప్పుకున్న కంపెనీలు, మోడల్స్ స్వతంత్ర భారతావనిలో ఆటోమొబైల్ సెక్టార్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన టాప్ 10 వాహనాలుగా ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.

ఇది కూడా చదవండి : Top Most Selling SUV cars in India : ఇండియాలో అత్యధికంగా సేల్ అయ్యే టాప్ 10 SUV కార్ల జాబితా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News