Car Insurance చేస్తున్నారా? ఈ విషయం తెలుసుకోండి

Car Insurance New Policy: కార్ యజమానులకు ఈ వార్త చాలా ఇంపార్టెంట్. ఇకపై మీరు కారు ఎంత కారు నడుపుతారో అంతే చెల్లించాల్సి ఉంటుంది.

Last Updated : Dec 23, 2020, 07:22 PM IST
    1. కార్ యజమానులకు ఈ వార్త చాలా ఇంపార్టెంట్.
    2. ఇకపై మీరు కారు ఎంత కారు నడుపుతారో అంతే చెల్లించాల్సి ఉంటుంది.
Car Insurance చేస్తున్నారా? ఈ విషయం తెలుసుకోండి

New Car Insurance Policy : మీ దగ్గర కారు ఉంటే మీరు సంవత్సరానికి 365 రోజులు నడిపరు కదా. పైగా ఈ రోజుల్లో బయటికి వెళ్లడం చాలా వరకు తగ్గిపోయింది. చాలా మంది కార్స యజమానులు సంవత్సరానికి 200 రోజులు కూడా కారు నడపరు అని ఒక రిపోర్టు తెలిపింది. అప్పుడు సంవత్సరం మొత్తానికి ప్రీమియం ఎందుకు చెల్లించడం అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీరు 165 రోజులు మాత్రమే కారు నడిపిస్తే 365 రోజుకు ఎందుకు చెల్లించడం అని మీకు ఆలోచన వచ్చే ఉంటుంది. ఇప్పుడు ఇన్సురెన్స్ సంస్థలు Pay As You Drive అనే విధానాన్ని తీసుకువచ్చింది.

ALSO READ|  Driving at Night: డ్రైవింగ్ చేస్తోంటో నిద్ర వస్తోందా? ఇలా చేయండి

ఎంత నడుపుతారో అంతే చెల్లించండి..
Pay As You Drive అనేది చాలా యూనిక్ ప్లాన్. కారు (Car) వాడుతున్న సమయంలోనే ప్రీమియం చెల్లించాలి అని ఇన్సురెన్స్ సంస్థలు కోరుతాయి. అంటే కారు డ్రైవింగ్ చేయడానికి వెళ్తేనే ప్రీమియం అన్నమాట.

కస్టమైజ్డ్ కార్ పాలసీ
వాస్తవానికి మనం పాలసీ అనేది సంవత్సరం మొత్తానికి తీసుకుంటాం. అయితే ఈ కొత్త పాలసీలో వినియోగదారులకు కొన్ని కొత్త అవకాశాలు కల్పిస్తోంది. ఇందులో ప్రీమియం అనేది కస్టమైజ్డ్ చేసి ఉంచుతారు. ఇది ప్రతీ వినియోగదారుడికి వేరుగా ఉంటుంది. 

ALSO READ| Health Insurance: హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా ? ఈ విషయంలో జాగ్రత్త

నూతన స్కీమ్
IRDAI ఆదేశాల మేరకు Bharti Axa General, Go Digit, TATA AIG, ICICI Lombard, Edelweiss 
వంటి సంస్థలు త్వరలో ఈ పాలసీలను అందుబాటులోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాయి.

ఎంత దూరమో.. అంత ప్రీమియం
సంవత్సరానిక ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తారో అంతే ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో వినియోగదారులకు 2500 కిమీ, 5000 కిమీ, 7500 కిమీ అనే మూడు ఆప్షన్స్ దొరుకుతాయి. ఇందులో వినియోగదారులు ఎదో ఒక ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. 

ALSO READ| Online Banking: ఇంటర్నెట్ బ్యాంకింగ్ చేసేవారు ఈ విషయాలు తప్పకుండా గుర్తుంచుకోవాలి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

  

Trending News