Jio Free Services: జియో యూజర్లకు గుడ్ న్యూస్.. ఆ రెండు రోజులు అన్ని సర్వీసులు ఉచితం!

Jio Free Services: ప్రముఖ టెలికాం నెట్ వర్క్ రిలయన్స్ జియో మరో నిర్ణయాన్ని ప్రకటించింది. ఇటీవలే ముంబయిలో నెట్ వర్క్ సమస్యను ఎదుర్కొన్న వినియోగదారులకు రెండు రోజుల పాటు ఉచిత సేవలను అందించనున్నట్లు రిలయన్స్ జియో పేర్కొంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 8, 2022, 07:13 AM IST
    • ముంబయిలో నెట్ వర్క్ సమస్య తలెత్తడం పై జియో స్పందన
    • కీలక నిర్ణయం తీసుకున్న జియో టెలికాం సంస్థ
    • రెండు రోజుల పాటు ఉచిత సేవలు అందించనున్నట్లు ప్రకటన
Jio Free Services: జియో యూజర్లకు గుడ్ న్యూస్.. ఆ రెండు రోజులు అన్ని సర్వీసులు ఉచితం!

Jio Free Services: దేశంలోనే నంబర్ వన్ ప్రైవేట్ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో తాజాగా ఓ కొత్త నిర్ణయాన్ని ప్రకటించింది. దీని వల్ల కొంతమంది ప్రత్యేక వినియోగదారులకు (రెండు రోజులకు jio ఉచిత సేవ) రెండు రోజులు ఉచిత సర్వీస్ ను పొందనున్నారు.

ఈ ఉచిత సేవ ఎందుకు?

గత కొన్ని రోజులుగా, ముంబయిలోని చాలా మంది జియో వినియోగదారులు నెట్ వర్క్ సమస్యలను ఎదుర్కొంటున్నారు. జియో నెట్ వర్క్ డౌన్ అవ్వడం వల్ల యూజర్లు చాలా మంది అనేక ఇబ్బందులు పడ్డారు. దీంతో దాదాపుగా 8 గంటలకు పైగా జియో సేవలు ముంబయి నగర వ్యాప్తంగా నిలిచిపోయాయి. 

దీంతో జియో కస్టమర్లు అందరూ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. నెట్ వర్క్ డౌన్ తో తమ కస్టమర్లు ఎదుర్కొన్న సమస్యలకు ప్రతిఫలంగా ముంబయి వ్యాప్తంగా జియో సేవలను రెండు రోజులు ఉచితంగా అందించనున్నట్లు ఆ కంపెనీ ప్రకటించింది. 

రెండు రోజులు ఉచిత సేవను ఎలా పొందవచ్చు?

అయితే జియో ప్రవేశ పెట్టిన రెండు రోజులు ఉచిత సేవను ఎవరు పొందవచ్చు? దాన్ని పొందాలంటే ఏం చేయాలి? అనే ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం చెప్పబోతున్నాం. జియో ప్రవేశపెట్టిన రెండు రోజులు ఉచిత సేవ కేవలం ముంబయిలో జియో వినియోగదారులకు మాత్రమే. ఈ ఉచిత సేవలు ప్రతి యూజర్ కు సంబంధించిన ప్రస్తుత రీఛార్జ్ ప్యాక్ కు జోడించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. దీంతో ప్రస్తుత ప్యాక్ చెల్లుబాటు రెండు రోజుల పాటు పొడిగించనున్నారు. 

ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు. 2021లోనూ ఇలాంటి సమస్యే ఎదురయ్యింది. కానీ, అలా కొంతమందికి మాత్రమే నెట్ వర్క్ సమస్య తలెత్తగా.. వారికి రెండు రోజుల పాటు ఉచిత సేవలు అందించారు.  

Also Read: Tata Free Offers: టాటా నుంచి అద్భుతమైన ఆఫర్, అపరిమితమైన సర్వీస్‌తో ఫ్రీ డేటా

Also Read: PNB rates: సేవింగ్స్ ఖాతా డిపాజిట్లకు వడ్డీ తగ్గించిన పీఎన్​బీ- కొత్త రేట్లు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News