June New Launching Car And Bike: భారతదేశ ఆటోమొబైల్ రంగం గత కొన్ని ఏళ్ల నుంచి అద్భుతమైన వృద్ధిని సాదిస్తూ దూసుకెళ్తోంది. భారత్ కస్టమర్స్ మార్కెట్లోకి లాంచ్ అయ్యే కార్లతో పాటు మోటర్ సైకిల్స్‌ను కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఆటోమొబైల్ కంపెనీలు కూడా కొత్త కొత్త కార్లలను తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్నాయి. దీంతో పాటు భారత ఆటో మొబైల్స్‌కి గట్టి పోటీనిచ్చేందుకు ఇతర దేశాల కంపెనీ కార్లు కూడా బాగా సేల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే కొన్ని కంపెనీ ప్రీమియం ఫీచర్స్ కలిగిన కార్లలను కూడా అతి తక్కువ ధరలకే విక్రయిస్తున్నాయి. ఎప్పటి నుంచో మీరు కూడా అతి తక్కువ ధరలోనే మంచి కారును కొనుగోలు చేయాలనుకుంటున్నారా?
మంచి కారును కొనుగోలు చేయాలనుకునేవారు ఇంకా రెండు వారాల పాటు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ జూన్‌లో భారత మార్కెట్లోకి మరో ఒక కారు, ఒక మోటర్ సైకిల్ లాంచ్ కాబోతోంది. ఇవి ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రానున్నాయి. ప్రముఖ భారతీయ కంపెనీ టాటా మోటార్స్ ఈ నెలలో ఆల్ట్రోజ్ రేసర్‌ను విడుదల చేయబోతోంది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు ఈ నెలలో బజాజ్ కంపెనీ కూడా CNGతో నడిచే మోటార్‌సైకిల్‌ను లాంచ్ కాబోతోంది. అయితే వీటికి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
టాటా ఆల్ట్రోజ్ రేసర్:
టాటా కంపెనీ ఈ ఆల్ట్రోజ్ రేసర్ కారును జూన్ 13న విడుదల చేయబోతున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇది అద్భుతమైన పవర్‌ట్రెయిన్‌తో అందుబాటులోకి రానుంది. దీంతో పాటు ఈ కారు 1.2-లీటర్ 3-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది. దీని ఇంజన్ గరిష్టంగా 120bhp శక్తితో పాటు 170Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే ఈ కారు 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది 6-ఎయిర్‌బ్యాగ్‌లతో వస్తోంది. అలాగే 360-డిగ్రీ కెమెరాలతో రాబోతోంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
బజాజ్ బ్రూజర్:
బజాజ్ ఆటో మొబైల్ కంపెనీ త్వరలోనే గుడ్ న్యూస్ తెలపబోతోంది. కంపెనీ మొదటి CNG మోటార్‌సైకిల్‌ను లాంచ్ చేయబోతోంది. దీనిని జూన్ 18న విడుదల చేయబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది. కంపెనీ బెర్గర్ లేదా ఫైటర్ పేర్లతో లాంచ్ చేసే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు ఈ బైక్‌ను కేవలం రూ.85,000కే విడుదల చేయబోతోంది. దీంతో పాటు ఇది 125cc రెగ్యులర్ ఇంజన్‌తో అందుబాటులోకి రానుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి