Marriage Cancel: ఒక్కోసారి కొన్ని సిల్లీ పనులు పెద్ద పెద్ద కొంపలు కూలుస్తాయి. అలాంటి ఘటనే మహారాష్ట్రలోని ముర్తిజాపూర్ లో జరిగింది. ఆ గ్రామానికి చెందిన ఓ యువతికి అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడితో కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధం కుదిర్చారు. అంతేకాదు మ్యారేజ్ కు కావాల్సిన అని విషయాలు మాట్లాడుకొని పెళ్లి తేది సైతం నిశ్చయం చేశారు.
అయితే పెళ్లికి కొన్ని రోజుల ముందు పెళ్లి కూతురు మేనమామ పెళ్లి కుమారుడి సిబిల్ స్కోర్ ను ఆన్ లైన్ లో చెక్ చేశాడు. ఈ సందర్భంగా పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతడు అప్పటికే అనేక బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నట్లుగా గుర్తించారు. అతని సిబిల్ స్కోర్ దారుణంగా ఉండటంతో వారు ఈ మ్యారేజ్ కు నో చెప్పడం సంచలనం రేపింది. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూర్ లిమిటెడ్ (CIBIL) అందించే దాన్ని సిబిల్ స్కోర్ గా పరిగణిస్తారు. ఒక వ్యక్తి ఎలాంటి రుణం తీసుకున్నాడు.
ఇదీ చదవండి: గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!
ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
ఎపుడు ఎక్కడా ఏ బ్యాంక్ లో తీసుకున్నాడనే విషయంతో సిబిల్ స్కోర్ తో స్పష్టమవుతోంది. ఒక వ్యక్తికి ఇంటికి సంబంధించిన రుణం సహా ఏ బ్యాంక్ లోన్ కైనా ఇదే ఆధారం. ఒక వ్యక్తి క్రెడిట్ కార్డు వంటి వాటిని ఎలా మెయింటెన్ చేస్తున్నారనే డేటా ఆధారంగా క్రెడిట్ స్కోర్ ను లెక్కిస్తారు. అయితే బ్యాంక్ ఏదైనా లోన్ ఇచ్చే ముందు ఈ క్రెడిట్ స్కోర్ పరిశీలిస్తోంది. అందులో మంచి స్కోర్ ఉన్నవారికే లోన్స్ శాంక్షన్ చేస్తుంటాయి.
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.