Moto G31 launched in India: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ 'మోటోరోలా' (Motorola) వరుసగా భారత మార్కెట్లోకి స్మార్ట్ ఫోన్స్‌ను విడుదల చేస్తోంది. ఇప్పటికే మోటో జీ30ని విడుదల చేసిన మోటోరోలా.. తాజాగా దానికి కొనసాగింపుగా జీ31 (Moto G31)ను మార్కెట్లోకి లాంఛ్ చేసింది. రెడ్‌మీ నోట్ 10, రియల్‌మీ 8i, సామ్‌సంగ్ గెలాక్సీ M21 వంటి ఇతర స్మార్ట్‌ఫోన్‌లకు పోటీగా మోటోరోలా ఈ కొత్త పీస్‌ను మార్కెట్లోకి వదిలింది. మోటో జీ31 డిసెంబర్ 6 నుంచి కొనుగోలుదారులకు అందుబాటులోకి వస్తుంది. ఓసారి మోటో జీ31 ఫీచర్స్, ధర ఎంతో చూద్దాం.
మోటో జీ31 (Moto G31) రెండు వేరియంట్లలో విడుదల కానుంది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999లుగా.. 6 జీబీ రామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999గా భారతదేశంలో ఉండనుంది. బ్లూ, గ్రే కలర్స్‌లో ఈ ఫోన్ కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుంది. 2021 డిసెంబర్ 6 మధ్యాహ్నం 12 నుంచి మోటో జీ31 ఫోన్ సేల్స్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా ప్రారంభం కానున్నాయి. అన్నీ మోటోరోలా మొబైల్స్ మాదిరిగానే స్టాక్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ (ఆండ్రాయిడ్ 11 ఓఎస్) ఇందులో ఉంటుంది.
మోటో జీ31 60 హెచ్‌జెడ్ రీఫ్రెష్ రేట్‌తో 6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఓఎల్ఈడీతో వస్తుంది. మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్ ఉంటుంది. గేమ్స్ ఆడేవారి కోసం ఏఆర్‌ఎమ్ మాలి-జీ52 గ్రాఫిక్ కార్డు ఇస్తున్నారు. జీ31లో మొత్తంగా నాలుగు కెమెరాలు ఉంటాయి. 50 ఎంపీ మెయిన్ కెమెరా, 8 ఎంపీ వైడ్ యాంగిల్ కెమెరా, 2 ఎంపీ మాక్రో కెమెరా మరియు 13 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. సైబర్ దాడుల నుంచి కాపాడేందుకు థింక్ షీల్డ్ సెక్యూరిటీతో రక్షణ ఇస్తున్నారు. ఈ ఫోన్‌పై నీటి తుంపరలు పడినా ఏమీకాదు. ఇందులో 5000 ఎమ్ఎహెచ్ బ్యాటరీ ఉంటుంది కాబట్టి.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 36 గంటలపాటు పనిచేస్తుంది.
Also Read: ఒమిక్రాన్‌పై కేంద్రం అప్రమత్తత, అంతర్జాతీయ ప్రయాణాలపై మార్గదర్శకాలు
మోటో జీ31 ఫీచర్స్ ఇవే:
# మీడియాటెక్ హీలియో జీ85 ఎస్‌వోసీ ప్రాసెసర్
# ఆండ్రాయిడ్ 11 ఓఎస్
# 6.4 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్, ఓఎల్ఈడీ
# 60 హెచ్‌జెడ్ రీఫ్రెష్ రేట్
# ఏఆర్‌ఎమ్ మాలి-జీ52 గ్రాఫిక్ కార్డు
# 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
# హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ స్లాట్
# 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
# 50 ఎంపీ రేర్ కెమెరా, 13 ఎంపీ సెల్ఫీ కెమెరా
# 4జీ ఎల్‌టీఈ
# 3.5 ఎంఎం ఆడియో జాక్
# బ్లూటూత్ వీ5, డుయల్ బాండ్ వైఫై 802.11 ఏసీ
# యూఎస్‌బీ సీ టైప్ పోర్ట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook