PVR Inox Mega Merger: సినిమా ఎగ్జిబిషన్ వ్యాపారంలో పేరుగాంచిన మల్టీప్లెక్స్ సంస్థలు పీవీఆర్ , ఐనాక్స్ రెండూ విలీనం కానున్నాయి. విలీన ఒప్పందానికి కంపెనీల బోర్డులు ఆదివారం ఆమోదం తెలిపాయి. విలీనానంతర సంస్థకు పీవీఆర్ సీఎండీ అజయ్ బిజ్లీ ఎండీగా, సంజీవ్ కుమార్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరించనున్నారు. ఐనాక్స్ గ్రూప్ ఛైర్మన్ పవన్ కుమార్ జైన్ బోర్డు నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా, సిద్ధార్థ్ జైన్ నాన్-ఎగ్జిక్యూటివ్ నాన్-ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా వ్యవహరించనున్నారు. ఆ
ఒప్పందానికి పీవీఆర్, ఐనాక్స్ షేర్‌హోల్డర్ల ఆమోదంతో పాటు.. స్టాక్ ఎక్స్ఛేంజీలు, సెబీ, సీసీఐ నుంచీ అనుమతులు అందాల్సి ఉంది. విలీనానంతర సంస్థను పీవీఆర్ ఐనాక్స్ లిమిటెడ్‌గా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. మల్టీప్లెక్స్ వరకు చూస్తే పీవీఆర్+ఐనాక్స్, సినీ పొలిస్‌లు కలిసి బాక్సాఫీసు ఆదాయంలో 50 శాతానికి పైగా వాటా కలిగి ఉన్నాయి. విలీనం అనంతరం భారత మల్టీప్లెక్స్ వ్యవస్థలో ఈ సంస్థ ఆధిపత్యం కొనసాగనుంది.
కొత్తగా ఏర్పడే సంస్థలో పీవీఆర్ ప్రమోటర్లకు 10.62 శాతం వాటా, ఐనాక్స్ ప్రమోటర్లకు 16.66 శాతం వాటా లభించనుంది. దేశవ్యాప్తంగా పీవీఆర్‌కు 73 పట్టణాల్లోని 181 ప్రాంతాల్లో 871 స్క్రీన్లు ఉన్నాయి. ఐనాక్స్‌కు 72 పట్టణాల్లో 675 తెరలున్నాయి. కొత్త కంపెనీకి దేశంలోని 109 పట్టణాల్లో 341 ప్రాంతాల్లో 1,546 తెరలు ఉండనున్నాయి.
2020 ఆర్థిక సంవత్సరం నాటికి ఒక్కో తెరకు ఐనాక్స్‌కు వచ్చే ప్రకటనల ఆదాయం పీవీఆర్‌తో పోలిస్తే 33 శాతం తక్కువ అని ఎలారా క్యాపిటల్ ఉపాధ్యక్షుడు కరణ్ తెలిపారు. ఇరు సంస్థలు కలిస్తే ఐనాక్స్ తెరల ప్రకటనల ఆదాయం సైతం పీవీఆర్‌తో సమానంగా ఉండే అవకాశం ఉందని వివరించారు. కన్వీనియెన్స్ ఫీజు విషయంలోనూ పీవీఆర్‌తో పోలిస్తే ఐనాక్స్‌కు చాలా తక్కువ ఆదాయం వస్తోందని తెలిపారు. విలీనానంతర సంస్థలో కన్వీనియెన్స్ ఫీజునూ భారీగా పెంచుకునే వెసులుబాటు ఉంటుందన్నారు. ఆదాయం రూ.150 కోట్ల వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు.
కొత్త కంపెనీ మల్టీప్లెక్స్ ఇండస్ట్రీలో 50శాతం వాటా దక్కించుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పీవీఆర్‌కు ఉత్తర, పశ్చిమ, దక్షిణాదిలో బలమైన నెట్‌వర్క్ ఉండగా.. ఐనాక్స్‌కు తూర్పు ప్రాంతంలో ఎక్కువ స్క్రీన్స్ ఉన్నాయి. ఈ రెండు సంస్థలకు కలిపి బాక్సాఫీస్ ఆదాయంలో 42 శాతం వాటా ఉంది.
Also Read: PBKS vs RCB: డుప్లెసిస్ వీర బాదుడు... పంజాబ్‌కు భారీ టార్గెట్ సెట్ చేసిన ఆర్సీబీ...
Also Read: Video: రామ్ చరణ్ బర్త్ డే వేడుకల్లో ఎన్టీఆర్, రాజమౌళి.. ఎంతలా ఎంజాయ్ చేశారో చూడండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook