Budget 2024: బడ్జెట్ వేళ.. తెల్ల చీరలో మెరిసిన కేంద్ర మంత్రి ఆర్థిక మంత్రి నిర్మలమ్మ..!!

Budget 2024:కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం బడ్జెట్ సమర్పించారు. అయితే నిర్మలమ్మ ఈసారి బడ్జెట్ సమర్పించిన సమయంలో మరోసారి చేనేత చీరను దర్శించడం విశేషం. నిర్మలమ్మ బడ్జెట్ ప్రవేశపెట్టే ప్రతిసారి ఆమె కట్టుకున్న చీర అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

Written by - Bhoomi | Last Updated : Jul 23, 2024, 11:18 AM IST
Budget 2024: బడ్జెట్ వేళ.. తెల్ల చీరలో మెరిసిన కేంద్ర మంత్రి ఆర్థిక మంత్రి నిర్మలమ్మ..!!

Budget 2024:కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేడు ( మంగళవారం )  బడ్జెట్ ( Union Budjet 2024) సమర్పించారు. అయితే ఆమె ఈసారి బడ్జెట్ సమర్పించిన సమయంలో మరోసారి చేనేత చీరనే ధరించి అందరి దృష్టిని ఆకర్షించారు. గతేడాది బడ్జేట్ సమర్పించే సమయంలో ముదురు ఎరుపు రంగు చీరను ధరించి తన అభిరుచిని చాటుకున్నారు. ఈసారి తెల్లటి చీరను ధరించారు. నిర్మలమ్మ ధరించిన చూడాటానికి చాలా సొగసైనదిగా..చీర నిండా చతురస్రాకార డిజైన్లతో ఎంతో అందంగా ఉంది. చీర అంచు ఊదా రంగులో గోల్డ్ కలర్ పువ్వులతో ఉంది. చీర బార్డర్ మొత్తం ఊదా రంగులో ఉంటుంది. ఈ చీర కేరళ రాష్ట్ర సంప్రదాయ చీరలా కనిపిస్తుంది. మొత్తానికి ఆర్థిక మంత్రి మరోసారి చేనేత చీరలపై తన ప్రేమను చాటుకున్నారు. 

కాగా నేడు బడ్జెట్ సమర్పించే ముందు ఉదయం సీతారామన్ ఆర్థిక శాఖను సందర్శించారు. అక్కడ బడ్జెట్ ట్యాబ్లెట్ తో ఫొటో దిగారు. ఈ సందర్భంగా నిర్మలమ్మ వెంట కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి, ముఖ్య ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ ఉన్నారు. నిర్మలా సీతారామన్ రాకముందే ముందుగానే ఇద్దరూ అక్కడికి వచ్చారు. 

Also Read : Union Budget: బడ్జెట్‌లో యువతకు గుడ్‌న్యూస్? కేంద్ర బడ్జెట్‌తో స్మార్ట్‌ ఫోన్‌ ధరలు భారీగా తగ్గుదల?

నిర్మలమ్మ ఏ సంవత్సరంలో ఏ రంగు చీర ధరించారు?  

2019లో మోదీ కేబినెట్ లో ఆర్థిక మంత్రిగా చేరిన నిర్మలా సీతారామన్..అదే ఏడాది తన తొలి బడ్జెట్ ను సమర్పించారు. మొదటి బడ్జెట్ ప్రజెంటేషన్ కోసం లేత గులాబీ మంగళగిరి చీరను ధరించారు. ఆ చీర అంచు బంగారు వర్ణంలో ఉంది. అలాగే తన మొదటి ప్రజెంటేషన్ లో చాలా ఏండ్లు బ్రీఫ్ కేస్ సంస్క్రుతికి స్వస్తి పలికి బహియా ఖాటా విధానాన్ని ప్రారంభించారు. అంటే బడ్జెట్ పేపర్లు ఎర్రటి పట్టు గడ్డలో చుట్టి తీసుకురావడం. ఆ ఎర్రటి గుడ్డపై జాతీయ చిహ్నం ఉంటుంది. 

2020లో ఎల్లో కలర్ చీరకు గోల్డ్ కలర్ అంచు ఉన్న చీరను ధరించారు. దానికి బ్లూ కలర్ అంచు ఉంది. 2021లో రెడ్ అండ్ వైట్ మిక్సింగ్ కలర్ లో ఉన్న పోచంపల్లి చీరను ధరించారు. ఆ చీరపై ఇక్కత్ డిజైన్ ఉంది.  2022లో ఒడిశాకు చెందిన బూమ్ కై చీరను ధరించారు. బ్రౌ అండ్ రెడ్ మిక్సింగ్ తో ఈ చీర ఉంది. 2023లో రెడ్ కలర్ చీరను ధరించి బడ్జెట్ సమర్పించారు. 

Also Read : Budget2024: నిత్యవసరాల ధరలు ఎందుకు మండుతున్నాయి? బడ్జెట్ ముందు కేంద్రం విడుదల చేసిన కీలక డాక్యుమెంట్ ఇదే..!!

కాగా నిర్మలా సీతారామన్ తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు. ఆమె మాతృభాష తమిళం.ఏపీలోని నర్సాపురంకు చెందిన పరకాల ప్రభాకర్ ను వివాహం చేసుకున్నారు. పరకాల ప్రభాకర్ ప్రముఖ రాజకీయ, ఆర్థికవేత్తగా మనందరికీ సుపరిచితమే. ఏపీ ప్రభుత్వానికి గతంలో సలహాదారునిగా పనిచేశారు. వీరిద్దరు కూడా ఆర్ధిక శాస్త్రాన్ని అభ్యసించినవారే. సంప్రదాయ చీరకట్టులో నిర్మలా సీతారామన్ ఎప్పుడూ ఆకట్టుకుంటారు. ఇక బడ్జెట్ సందర్బంగా ధరించే చీర చాలా ప్రత్యేకంగా ఉంటుంది. 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News