PF Withdrawal Online: PF విత్ డ్రా చేస్తున్నారా..? అయితే ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి

How To Use Umang App For PF Withdraw: పీఎఫ్‌ డబ్బులను మీరు చాలా సింపుల్‌గా విత్ డ్రా చేసుకోవచ్చు. ఉమాంగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని మొబైల్ నుంచే క్లైయిమ్‌ ఫామ్‌ను సబ్మిట్ చేయవచ్చు. ఈపీఎఫ్‌ఓ ఖాతాను ట్రాక్ చేసుకోవచ్చు. బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 20, 2023, 07:55 PM IST
PF Withdrawal Online: PF విత్ డ్రా చేస్తున్నారా..? అయితే ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి

How To Use Umang App for PF Withdraw: చాలా మంది ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు తమ అకౌంట్‌లో నుంచి డబ్బులు ఎలా తీసుకోవాలి తెలియక ఇబ్బంది పడుతుంటారు. తమకు తెలిసిన వాళ్లను అడిగి.. క్లైయిమ్ ఫామ్‌ను నింపి డబ్బులు విత్ డ్రా చేసుకుంటారు. ఇలా ఎవరి మీద ఆధారపడకుండా ఇంట్లోనే కూర్చొని మీ మొబైల్ నుంచి పీఎఫ్ ఖాతా ద్వారా డబ్బులను తీసుకోవచ్చు. ఆన్‌లైన్ లావాదేవీలు, అడ్వాన్స్‌లు, పెన్షన్ క్లెయిమ్‌లను ఉమాంగ్ (UMANG) యాప్ ద్వారా లేదా ఈపీఎఫ్‌ఓ (EPFO) ​​మెంబర్ పోర్టల్ పూర్తి చేసుకోవచ్చు. ఇందుకోసం ఈ-నామినేషన్‌ చేయాల్సి ఉంటుంది. ఈపీఎఫ్‌ఓ సేవలను యాక్సెస్ చేయడానికి ఉమాంగ్ యాప్‌లో సులభతరంగా ఉంటుంది. ఈపీఎఫ్‌ఓ ఖాతాదారులు ఉమాంగ్ యాప్‌ను ఉపయోగించి మొబైల్ ఫోన్ ద్వారా తమ పీఎఫ్‌ అకౌంట్‌ను ట్రాక్ చేసుకోవచ్చు.

ఉమాంగ్ యాప్‌లో ఈపీఎఫ్‌ సేవలు ఇలా.. 

==> గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ ప్లే స్టోర్ నుంచి ఉమాంగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
==> యాప్‌ని ఓపెన్ చేసి.. మీ ఆధార్ నంబర్, పాస్‌వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.
==> సైన్ ఇన్ అయిన తర్వాత.. సేవల జాబితా నుంచి 'ఈపీఎఫ్‌ఓ సేవలు' ఆప్షన్‌ను ఎంచుకోండి.
==> మీకు కావాలనుకుంటున్న ఈపీఎఫ్‌ఓ ​​సర్వీస్ టైప్‌పై క్లిక్ చేయండి.

Also Read: Vijay Speech: ఓటుకు నోటుపై హీరో విజయ్ సంచలన వ్యాఖ్యలు.. రాజకీయ రంగ ప్రవేశానికి రెడీ..?

==> లావాదేవీని పూర్తి చేయడానికి ఆన్-స్క్రీన్ సూచనలను అనుసరించండి.

పీఎఫ్‌ నుంచి డబ్బులు ఇలా విత్ డ్రా చేసుకోండి

==> ఉమాంగ్ యాప్‌ను ఓపెన్ చేసి.. మీ ఆధార్ నంబర్, పాస్‌వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వండి. 
==> ఇప్పుడు సేవల జాబితా నుంచి 'ఈపీఎఫ్‌ఓ సర్వీస్' ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
==> అనంతరం 'రైజ్ క్లెయిమ్' ఆప్షన్‌ను ఎంచుకోండి.
==> మీ యూఏఎన్ నంబర్ ఎంటర్ చేయండి. తరువాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు పంపించిన ఓటీపీని ఎంటర్ చేయండి.
==> మీరు చేయాలనుకుంటున్న విత్ డ్రా టైప్‌ను ఎంచుకోండి.
==> ఇక్కడ అవసరమైన వివరాలను ఎంటర్ చేసి.. రిక్వెస్ట్‌ను సబ్మిట్ చేయండి.
==> అనంతరం మీ రిక్వెస్ట్‌కు సంబంధించి రసీదు సంఖ్యను అందుకుంటారు. 

ఉమాంగ్ యాప్‌లో ఈపీఎఫ్‌ఓ సేవలు ఇవే..

==> పీఎఫ్‌ బ్యాలెన్స్‌ను చెక్ చేసుకోవచ్చు
==> పీఎఫ్‌ ఖాతా నుంచి డబ్బులు క్లెయిమ్ చేసుకోవచ్చు.
==> కేవైసీ వివరాలను అప్‌డేట్‌ చేసుకోవచ్చు.
==> పాస్ బుక్ చెక్ చేసుకోవచ్చు.
==> లైఫ్ సర్టిఫికేట్ రూపొందించవచ్చు.
==> పెన్షన్ చెల్లింపు ఆర్డర్ (పీపీఎఫ్‌) డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
==> ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చు. వాటిని ట్రాక్ చేసుకోవచ్చు.

Also Read: Adipurush Controversy: ఆదిపురుష్‌పై వివాదం.. దేశవ్యాప్తంగా బ్యాన్ చేయాలని డిమాండ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News