SBI Alert: ప్రభుత్వం రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ కస్టమర్లను అలర్ట్ చేసింది. ఈ మధ్యకాలంకలో ఆన్లైన్ లావాదేవీలు భారీగాపెరిగిన నేపథ్యంలో.. సైబర్ మోసాలు అంతే స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా.. సురక్షితంగా ఆన్లైన్ లావైదేవీలు జరిపేందుకు ముఖ్యమైన సలహాలు చేసింది ఎస్బీఐ.
సైబర్ మోసాలు ఎలా జరుగుతున్నాయంటే..
సైబర్ నేరగాళ్లు.. ఆన్లైన్ పేమెంట్స్ చేసే వాళ్లు చేసే చిన్న చిన్న పొరపాట్లను ఆసరాగా చేసుకుని ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా ఇటీవలి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్స్ చేయడం సర్వ సాధారణమైంది.
ఆఫర్లు, లక్కీ డ్రా వంటి వాటి పేర్లతో మోసాలు చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. మీకు బహుమతి రావాలంటే.. మీ యూపీఐ పేమెంట్ యాప్ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్, చేసి పిన్ ఎఁటర్ చేయాలంటూ కస్టమర్లను మభ్య పెడుతున్నారు. అది నమ్మి స్కాన్ చేసి పిన్ ఎంటర్ చేసిన వారి ఖాతల నుంచి డబ్బులు కాజేస్తున్నారు.
ఇలా కొంత మంది డబ్బులు కోల్పోయిన నేపథ్యంలో ఎస్బీఐ అలర్ట్ అయ్యింది. ఇలాంటి మోసాల బారిన మరెవ్వరూ పడకుండా.. యూపీఐ పేమెంట్స్ చేసే వారికి 6 కీలక సూచనలు చేసింది.
You don't have to scan QR code for receiving money.
Remember the safety tips every time you make UPI payments.#UPITips #BHIMSBIPay #Safety #CyberSafety #AmritMahotsav #AzadiKaAmritMahotsavWithSBI pic.twitter.com/fnHEUm18B8— State Bank of India (@TheOfficialSBI) February 20, 2022
యూపీఐ పేమెంటేస్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
1.యూబీఐ పిన్ అనేది కేవలం డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడానికి మాత్రమే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. డబ్బులు రిసీవ్ చేసుకునేందుకు ఎలాంటి పిన్ అవసరం లేదు.
2.ఏదైనా మొబైల్ నంబర్, యపీఐ ఐడీకి డబ్బులు పంపే ముందు.. డిస్ప్లేలో వచ్చే పేరును ఒకటికి రెండు సార్లు సరిచూసుకోవాలి.
3.మీ యూపీఐ పిన్ను ఎవరితోనూ చెప్పొద్దు.
4.షాప్‌ల వద్ద, మరెక్కడైనా చెల్లింపులు చేయాల్సి వస్తే.. స్కాన్ ఆప్షన్‌కు మొదటి ప్రాధాన్యత ఇవ్వండి. స్కాన్ చేసిన తర్వాత సంబంధిత వ్యక్తితో పేరును దృవీకరించమని కోరడం ఇంకా ఉత్తమం.
5.యూపీఐ, ఆన్లైన్ పేమెంట్స్ విషయంలో ఏదైనా సమస్య వచ్చినా.. ఏదైనా సందేహం ఉన్నా బ్యాంకును సంప్రదించి మాత్రమే పరిష్కరించుకోవాలి. అపరిచిత వ్యక్తులతో ఇలాంటి విషయాల్లో సహాయం కోరొద్దు.
6.యూపీఐ ద్వారా చేసిన పేమంట్స్కు సంబంధించి ఏదైనా సమస్య తలెత్తితే.. సంబంధిత పేమెంట్ యాప్ హెల్ప్ సెక్షన్‌కు వెళ్లి సమస్యను పరిష్కరించుకోవాలి.
Also read: New Smartphones: దేశీయంగా ఈ వారం విడులయ్యే స్మార్ట్ఫోన్లు ఇవే..!
Also read: Flipkart Offers: ఫ్లిప్ కార్ట్ లో భారీ తగ్గింపు.. రూ.764 ధరకే స్మార్ట్ టీవీని కొనుగోలు చేయండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook