Stock Market today: ఒమిక్రాన్ భయాలున్నా స్టాక్ మార్కెట్ల జోరు- సెన్సెక్స్ 776 పాయింట్లు జంప్​

Stock Market News: కరోనా కొత్త వేరియంట్ భయాలు ఉన్నా దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. గురువారం సెషన్​లో సెన్సెక్స్  776 పాయింట్లు, నిఫ్టీ 235 పాయింట్లు పెరిగాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 2, 2021, 03:48 PM IST
  • స్టాక్ మార్కెట్లకు రెండో రోజూ భారీ లాభాలు
  • ఒమిక్రాన్ భయాలున్నా బుల్​ జోరు
  • 17,400 మార్క్ దాటిన నిఫ్టీ
Stock Market today: ఒమిక్రాన్ భయాలున్నా స్టాక్ మార్కెట్ల జోరు- సెన్సెక్స్ 776 పాయింట్లు జంప్​

Stock Market Updates: స్టాక్​ మార్కెట్లు వరుసగా రెండో రోజూ (గురువారం) లాభాలతో (Stocks closing bell) ముగిశాయి.

బాంబే స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- సెన్సెక్స్​ (BSE Sensex) 776 పాయింట్లు పెరిగి.. 58,461 వద్దకు చేరింది. నేషనల్​ స్టాక్ ఎక్స్ఛేంజి-నిఫ్టీ (NSE Nify) 235 పాయింట్ల లాభంతో 17,401 వద్ద స్థిరపడింది.

ఒమిక్రాన్​ భయాలు ఉన్నా సూచీలు ఆధ్యంతం జోరు కొనసాగించాయి. దాదాపు అన్ని రంగాలు సానుకూలంగా స్పందంచాయి. ఐటీ, ఆర్థిక షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.

ఈ రోజు సెషన్​ ఎలా సాగిందంటే..

ఇంట్రాడేలో (Intraday) సెన్సెక్స్​ 58,513 పాయింట్ల అత్యధిక స్థాయిని తాకింది. అమ్మకాల కారణంగా ఒకానొక దశలో 57,680 కనిష్ఠానికి పడిపోయింది.

నిఫ్టీ కూడా ఇంట్రాడేలో 17,420 పాయింట్ల అత్యధిక స్థాయిని తాకింది. 17,149 పాయింట్ల కనిష్ఠాన్ని తాకింది.

లాభ నష్టాల్లో టాప్​-5 షేర్లు..

బీఎస్ఈ 30 షేర్లలో 13 కంపెనీలు లాభాలను నమోదు చేశాయి. 17 కంంపెనీలు నష్టాలను నమోదు చేశాయి.

హెచ్​డీఎఫ్​సీ 3.87 శాతం, పవర్​గ్రిడ్​ 3.79 శాతం, సన్​ ఫార్మా 3.11 శాతం, టాటా స్టీల్​ 2.90 శాతం, బజాజ్ ఆటో 2.56 శాతం లాభాలను గడిచాయి.

ఐసీఐసీఐ బ్యాంక్​ 0.62 శాతం, యాక్సిస్ బ్యాంక్ 0.45 శాతం నష్టపోయాయి. 30 షేర్ల ఇండెక్స్​లో ఈ రెండు కంపెనీలు మాత్రమే నష్టాలను నమోదు చేశాయి. మిగతా 28 షేర్లు సానుకూలంగా స్పందించడం గమనార్హం.

ఆసియాలో ఇతర మార్కెట్లు..

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లను పరిశీలిస్తే.. సియోల్​ (దక్షిణ కొరియా), హాంకాంగ్, థైవాన్ సూచీలు లాభాలను నమోదు చేశాయి. షాంఘై (చైనా), టోక్యో (జపాన్​) సూచీలు నష్టాలను మూటగట్టుకున్నాయి.

కాస్త పెరిగిన రూపాయి..

డాలర్​తో పోలిస్తే రూపాయి విలువ 09 పైసలు బలపడింది. ప్రస్తుతం డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ 74.99 వద్ద కొనసాగుతోంది.

Also read: Smart TV Discount Offer: భలే మంచి చౌక బేరం.. అమెజాన్ లో రూ.6,999లకే స్మార్ట్ LED టీవీ!

Also read: HDFC Bank FD rates: హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ ఎఫ్​డీ రేట్లు పెంపు- కొత్త వడ్డీ రేట్లు ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News