Poco M4 Pro 5G: డెడ్ చీప్‌ ధరకే బెస్ట్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్.. రూ.20 వేలు విలువ చేసే ఫోన్ కేవలం రూ.749కే..

Poco M4 Pro 5G For Very Low Price: తక్కువ ధరలో బెస్ట్ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలని చూస్తున్నారా.. అయితే ఫ్లిప్‌కార్ట్ మీకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.  

Written by - Srinivas Mittapalli | Last Updated : Aug 5, 2022, 12:59 PM IST
  • ఫ్లిప్‌కార్ట్‌లో కళ్లు చెదిరే ఆఫర్స్
  • కేవలం రూ.749కే పోకో ఎం4 ప్రో 5జీ మొబైల్
  • ఈ ఆఫర్ పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి
Poco M4 Pro 5G: డెడ్ చీప్‌ ధరకే బెస్ట్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్.. రూ.20 వేలు విలువ చేసే ఫోన్ కేవలం రూ.749కే..

Poco M4 Pro 5G For Very Low Price: ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ పలు బ్రాండ్స్‌కి చెందిన స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపు అందిస్తోంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో యాపిల్, శాంసంగ్, ఇన్ఫినిక్స్, రెడ్‌మీ, పోకో తదితర బ్రాండ్స్ స్మార్ట్ ఫోన్లు బిగ్ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉన్నాయి. పోకో బ్రాండ్‌లో పోకో ఎం4 ప్రో 5జీ మోడల్‌పై డిస్కౌంట్‌తో పాటు ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. తద్వారా ఈ స్మార్ట్ ఫోన్‌ని డెడ్ చీప్‌గా రూ.749కే సొంతం చేసుకోవచ్చు.

పోకో ఎం4 ప్రో 5జీపై ఫ్లిప్‌కార్ట్ 27 శాతం డిస్కౌంట్ : 

'పోకో ఎం4 ప్రో 5జీ' మోడల్‌ అసలు ధర రూ.19,999. కానీ ఫ్లిప్‌కార్ట్‌లో 27 శాతం డిస్కౌంట్‌తో ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ.14,499కే అందుబాటులో ఉంది. అంటే.. డిస్కౌంట్ ద్వారా రూ.5500 వరకు ఆదా అవుతుంది. అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలుకు ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులు జరిపినట్లయితే మరో రూ.1వెయ్యి వరకు తగ్గింపు పొందవచ్చు. తద్వారా మరింత చౌకగా రూ.13,499కే ఈ స్మార్ట్ ఫోన్‌ని కొనుగోలు చేయవచ్చు. నెలకు కేవలం రూ.503 చెల్లించడం ద్వారా ఈఎంఐ పద్దతిలోనూ దీన్ని కొనుగోలు చేయవచ్చు.

ఎక్స్‌చేంజ్ ఆఫర్ ద్వారా కేవలం రూ.749కే : 

'పోకో ఎం4 ప్రో 5జీ' స్మార్ట్ ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ ద్వారా గరిష్ఠంగా రూ.13,750 వరకు తగ్గింపు పొందవచ్చు. అయితే ఎంత తగ్గింపు లభిస్తుందనేది ఎక్స్‌చేంజ్ కోసం మీరిచ్చే స్మార్ట్ ఫోన్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ పూర్తి ఆఫర్ లభించినట్లయితే మీరు చాలా లక్కీ అని చెప్పొచ్చు. ఈ ఆఫర్ ద్వారా రూ.14,499కి అందుబాటులో ఉన్న స్మార్ట్ ఫోన్‌ కేవలం రూ.749కే సొంతం చేసుకోవచ్చు.

పోకో ఎం4 ప్రో 5జీ ఫీచర్స్ :

6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ, ఎక్స్‌పాండెబుల్ అప్‌టు 1జీబీ
6.6 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే
50 మెగా పిక్సెల్+ 8 మెగా పిక్సెల్, 16 మెగా పిక్సెల్ కెమెరా సెటప్
5000 mAh బ్యాటరీ సామర్థ్యం
మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్ 

Also Read: MP Gorantla Madhav Live Updates: వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ రాసలీలల వీడియో లీక్.. పార్లమెంట్ లో రచ్చ

Also Read: Rain Alert: తెలంగాణ ప్రజలారా బీఅలర్ట్..మరో మూడు వారాలపాటు ఇక వానలే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook
 

Trending News