Sovereign Gold Bond scheme open from Monday: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి (2021-22) 'సిరీస్ 8' (Series 8 Gold bonds) సార్వభౌమ పసిడి బాండ్ల(ఎస్‌జీబీలు) ఇష్యూ ఈ నెల 29 నుంచి ప్రారంభం కానుంది. డిసెంబర్ 3 వరకు ఇవి సబ్ స్క్రిప్షన్కు (SGB Subscription last date) అందుబాటులో ఉంటనున్నాయి.
ఈ ఇష్యూకు గానూ గ్రాము పసిడి (SGB Issue price) ధర రూ.4,791గా నిర్ణయించింది ఆర్బీఐ. డిజిటల్ పద్దతిలో పసిడి బాండ్లను కొనుగోలు చేసే వారికి రూ.50 డిస్కౌంట్ లభిస్తుందని ఆర్బీఐ (RBI SGB price) వెల్లడించింది. అంటే డిజిటల్ రూపంలో పసిడి బాండ్లను కొనుగోలు చేసే వారికి గ్రాము ధర రూ.4,741గా ఉంటుంది.
సిరీస్ 7 ఎస్‌జీబీలో గ్రాము ధర రూ.7,761గా ఉండటం గమనార్హం.
సబ్‌స్ట్రైబ్ చేసుకున్న ఎస్్జీబీలను డిసెంబర్ 7న లబ్దిదారులకు కేటాయింపులు (SGB Allotment date) చేయనుంది ఆర్బీఐ.
ఏమిటి ఈ సార్వభౌమ పసిడి బాండ్లు
ప్రభుత్వం జారీ చేసే బాండ్ల లాంటివే సార్వభౌమ పసిడి బాండ్లు. వీటిని ప్రభుత్వం తరఫున ఆర్బీఐ జారీ చేస్తుంది. వీటిని గ్రాముల చొప్పున కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
ఈ బాండ్లు బ్యాంకులు(స్మాల్ ఫినాన్స్ బ్యాంకులు, పేమెంట్స్ బ్యాంకుల వద్ద తప్ప), స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్‌హెచ్‌సీఐఎల్), పోస్టాఫీసులు, గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లు(ఎన్ఎస్ఈ, బీఎస్ఈ)ల వద్ద అందుబాటులో (How to Buy SGB) ఉంటాయి.
2015లో ఈ ఎస్జీబీలను ప్రవేశపెట్టింది ఆర్బీఐ. బంగారంపై మదుపును మళ్లించేందుకు వీటని తీసుకొచ్చింది. భౌతికంగా కొనుగోలు చేయడం కన్నా.. బాండ్ల రూపంలో కొనుగోలు చేయడం ద్వారా మదుపరులకు అనేక ఉపయోగాలు ఉంటాయి. ముఖ్యంగా తరుగు, దొంగిలించడం వటి సమస్యలకు తావుండదు.
వీటిల్లో పెట్టుబడి ద్వారా వార్షికంగా 2.5 శాతం వడ్డీ ఆదాయాన్ని ఆర్జించవచ్చు. ఈ వడ్డీని ప్రతి ఆరు నెలలకు ఓసారి మదుపరుల ఖాతాల్లో జమ చేస్తారు.
ఈ బాండ్లకు ఎనిమిది సంవత్సరాల మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. ఐదు సంవత్సరాల అనంతరం పెట్టుబడిని ఉపసంహరించుకునే(ఎగ్జిట్ ఆప్షన్) అవకాశం ఉంటుంది. పెట్టుబడి వెనక్కి తీసుకోవటం లేదా మెచ్యూరిటీ పీరియడ్‌లో ఉన్న బంగారం ధరకు ప్రకారమే అప్పటి ధర నిర్ణీతమౌతుంది.
ఎంత పెట్టుబడి పెట్టొచ్చు..
వ్యక్తిగతంగా కనీసం 1 గ్రాము నుంచి 4 కిలోల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. అయితే ట్రస్ట్‌లకు 20కిలోల గరిష్ఠ పరిమితి ఉంటుంది.
మరిన్ని..
వీటిపై దీర్ఘకాల మూలధన లాభాల పన్ను వర్తించదు. టీడీఎస్ కూడా ఉండదు. ఈ బాండ్లను చూపించి బ్యాంకుల నుంచి అప్పులు తీసుకోవచ్చు. ఈ బాండ్లను కానుకగా కూడా ఇవ్వొచ్చు.
Also read: Bank Holidays: డిసెంబర్‌లో ఏకంగా 16 రోజులు బ్యాంకులకు సెలవులు.. అవేంటో మీరే చూడండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook