SBI Hikes MCLR: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్లకు భారీ షాకిచ్చింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR)ను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఎంపిక చేసిన టేనర్‌లపై 10 బేసిస్ పాయింట్ల (bps) వరకు పెంచింది. తాజాగా పెంచిన కొత్త రేట్లు ఇవాళ్టి నుంచే అమల్లోకి వచ్చినట్లు ఎస్‌బీఐ వెల్లడించింది. ఎస్‌బీఐ నిర్ణయంతో వెహికల్, హోమ్ లోన్ల ఈఎంఐలు మరింత ఖరీదు కానున్నాయి. ఎస్‌బీఐ ఒక నెల MCLR బెంచ్‌మార్క్ రేటును 5 బేసిస్ పాయింట్లు పెంచడంతో 8.35 శాతానికి చేర్చింది.
Also Read: Floods Marriage: ఫంక్షన్‌లంటే మాకు పిచ్చి.. ఎట్లున్నా వెళ్లి తీరుతాం
మూడు నెలల MCLR బెంచ్‌మార్క్ రేటు 10 బీఎపీఎస్ నుంచి 8.40 శాతానికి పెరిగింది. ఆరు నెలలు, ఒక సంవత్సరం, రెండు సంవత్సరాల కాలానికి 10 బీపీఎస్ పాయింట్లు పెంచింది. దీంతో ఆరు నెలల కాలానికి 8.75 శాతం, ఏడాదికి 8.85%, రెండేళ్లకు 8.95 శాతానికి పెరిగాయి. మూడేళ్ల ఎంసీఎల్‌ఆర్‌ను 5 బేసిస్ పాయింట్లు 9 శాతానికి పెంచింది.హోమ్, వెహికల్ లోన్లు MCLR రేట్లతో అనుసంధానమై ఉంటాయి. ఈ లోన్ల EMI మరింత ప్రీమియం కానున్నాయి.
కొత్త రేట్లు ఇలా..
==> ఒక రోజు-8.1 శాతం
==> ఒక నెల-8.35 శాతం
==> మూడు నెలలు -8.4 శాతం
==> ఆరు నెలల-8.75 శాతం
==> ఒక సంవత్సరం-8.85 శాతం
==> రెండు సంవత్సరాలు-8.95 శాతం
==> మూడు సంవత్సరాలు-9 శాతం
ఎంసీఎల్ఆర్ అంటే..?
మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR) అనేది ప్రామాణిక లోన్ రేటు. ఎంసీఎల్ఆర్‌ను ఏప్రిల్ 1, 2016న ప్రారంభించారు. లోన్ కోసం బ్యాంకులు విధించే కనీస వడ్డీ రేటును మార్జినల్ కాస్ట్ బేస్డ్ లెండింగ్ రేటు ఆధారంగా నిర్ణయిస్తారు. ఇది ఫ్లోటింగ్ వడ్డీ రేట్లపై ప్రభావం చూపిస్తుంది. ఎంసీఎల్‌ఆర్‌ను నిర్ణయించేటప్పుడు డిపాజిట్ రేట్లు, రెపో రేట్లు, ఆపరేషనల్ ఖర్చులు, నగదు నిల్వల నిష్పత్తిని నిర్వహించడానికి అయ్యే ఖర్చుతో సహా అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఆ తరువాతే ఎంసీఎల్ఆర్ రేటును పెంచుతారు.
Also Read: Ram Charan: రామ్ చరణ్ ఫ్యాన్స్ గుండెల్లో గునపం దింపిన శంకర్.. ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి