Stock Market today: స్టాక్ మార్కెట్లకు లాభాలు ఒక్కరోజు ముచ్చటగానే మిగిలాయి. గురువారం సెషన్లో మళ్లీ (stocks closing bell) నష్టాలను నమోదు చేశాయి సూచీలు.
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ- సెన్సెక్స్ (BSE Sensex) 581 పాయింట్లు తగ్గి 57,276 వద్దకు చేరింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ-నిఫ్టీ (NSE Nify) 167 పాయింట్ల నష్టంతో 17,110 వద్ద స్థిరపడింది.
వరుసగా ఆరు సెషన్లలో నష్టపోయిన స్టాక్ మార్కెట్లు మంగళవారం (జనవరి 25న) కాస్త తేరుకున్నాయి. అయితే బుధవారం (గణతంత్ర దినోత్సవం) సెలవు తర్వాత.. నేటి సెషన్లో మళ్లీ కుప్పకూలాయి. అంతర్జాతీయంగా దాదాపు అన్ని స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోవడంతో ఆ ప్రభావం దేశీయ సూచీలపై పడిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
నేటి సెషన్లో ఐటీ, ఎఫ్ఎంసీజీ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. బ్యాంకింగ్, ఆటోమొబైల్ షేర్లు కాస్త సానుకూలంగా స్పందించాయి.
ఈ రోజు సెషన్ ఎలా సాగిందంటే..
ఇంట్రాడేలో (Intraday) సెన్సెక్స్ 57,508 పాయింట్ల అత్యధిక స్థాయిని తాకింది. అమ్మకాల కారణంగా ఒకానొక దశలో 56,439 కనిష్ఠానికి పడిపోయింది.
నిఫ్టీ కూడా ఇంట్రాడేలో 17,182 పాయింట్ల అత్యధిక స్థాయిని తాకింది. 16,866 పాయింట్ల కనిష్ఠాన్ని తాకింది.
లాభ నష్టాల్లో టాప్-5 షేర్లు..
బీఎస్ఈ 30 షేర్ల ఇండెక్స్‌లో 9 కంపెనీలు మాత్రమే లాభాలను నమోదు చేశాయి. మిగతా 21 కంపెనీలు డీలా పడ్డాయి.
యాక్సిస్ బ్యాంక్ 3.33 శాతం, మారుతీ సుజుకీ 2.98 శాతం, కోటక్ మహీంద్రా బ్యాంక్ 2.32 శాతం, ఇండస్ఇండ్ బ్యాంక్ 1.05 శాతం లాభాలను గడించాయి.
హెచ్‌సీఎల్‌టెక్ 3.98 శాతం, టెక్ మహీంద్రా 3.46 శాతం, డాక్టర్ రెడ్డీస్ 3.37 శాతం, విప్రో 3.15 శాతం, టీసీఎస్ 3.11 శాతం నష్టపోయాయి.
ఆసియాలో ఇతర మార్కెట్లు..
ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లను పరిశీలిస్తే.. షాంఘై (చైనా), టోక్యో (జపాన్), సియోల్ (దక్షిణ కొరియా), హాంగ్ సెంగ్ (హాంకాంగ్) సూచీలు నష్టపోయాయి. థైవాన్ సూచీ సెలవులో ఉంది.
రూపాయి విలువ..
డాలర్‌తో పోలిస్తే రూపాయి 30 పైసలు తగ్గింది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.75.07 వద్ద (Rupee Value today) కొనసాగుతోంది.
Also read: Jio Recharge Plan: జియో కస్టమర్లకు బంపర్ ఆఫర్.. రూ.150లకే అన్ లిమిటెడ్ కాల్స్, హైస్పీడ్ డేటా
Also read: Today Gold Price : దేశంలో మళ్లీ పెరిగిన బంగారం ధర...10 గ్రాముల పసిడి ధర ఎంతంటే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook