Tata Nexon EV: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్.. ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) విభాగంలో స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా లాంగ్ రేంజ్ ఈవీని విడుదల చేసేందుకు ప్రయత్నిస్తోంది.
ఇప్పటికే మార్కెట్లో బెస్ట్ సెల్లర్‌గా ఉన్న నెక్సాన్ ఈవీని మరింత అడ్వాన్స్డ్గా మార్పులు చేసిందట. ఇందులో లాంగ్ రేంజ్ వేరియంట్‌ను అతి త్వరలో విడుదల చేసేందుకు సిద్ధమవుతోందని తెలిసింది. ఆటోమొబైల్ వర్గాల ప్రకారం ఏప్రిల్‌లోనే ఈ వాహనం విడుదలనుంది. ఆ తర్వాత వీలైనంత త్వరగానే విక్రయాలు కూడా ప్రారంభమవ్వచ్చని సమాచారం. అయితే దీనిపై కంపెనీ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
కొత్త వెర్షన్ గురించి..
ఎస్యూవీ సెగ్మెంటోలో నెక్సాన్ ఈవీ 2020లో విడుదలైంది. ఇప్పుడు దీనికి అప్డేట్ వెర్షన్ రానుంది. కొత్త వేరియంట్లో సరికొత్త ఇంటీరియర్‌తో రానుందట. ఈ కొత్త వేరియంట్ ఎక్స్ 2 ప్లాట్‌ఫామ్‌పై రావచ్చని ఆటోమొబైల్ వర్గాల సమాచారం.
ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 400 కిలో మీటర్లు ప్రయాణించేందుకు వీలుగా ఈ కొత్త వేరియంట్‌ను అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది. అయితే లాంగ్ రేంజ్ కోసం బ్యాటరీ పరిమాణం పెరగటం, ట్రంక్ స్పేస్ తగ్గటం వంటి మార్పులు ఉండొచ్చని సమాచారం. ఛార్జింగ్ ప్యాక్‌లు 3.3 కిలో వాట్స్‌తో పాటు.. 6.6 కిలో వాట్స్ ఆప్షన్‌తో కూడా లభించే వీలుందని తెలిసింది. అయితే కంపెనీ నుంచి ఈ కొత్త వెర్షన్ నెక్సాన్‌పై త్వరలోనే ప్రకటన వెలువడొచ్చని సమాచారం. అప్పుడే దీనిపై మరింత సమాచారం తెలియనుంది.
Also read: Aadhaar ration linking: ఆధార్, రేషన్ లింక్‌కు గడువు పెంపు- కొత్త డేట్ ఇదే..
Also read: Stocks today: వారాంతంలో స్టాక్ మార్కెట్లకు నష్టాలు- 57,500 దిగువకు సెన్సెక్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook