Tecno Pova 5G Smartphone: వాలెంటైన్స్ డే కానుకగా సూపర్ ఫీచర్స్‌తో కొత్త స్మార్ట్ ఫోన్

Tecno Pova 5G Mobile: పాంథర్ గేమ్ ఇంజిన్ 2.0తో వచ్చిన టెక్నో 5జీ స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్స్ ఎంతో బాగున్నాయి. ఫిబ్రవరి 14 నుంచి అమెజాన్‌లో సేల్‌కు ఉండనున్న ఈ మొబైల్ ఫుల్‌ డిటేల్స్‌పై ఓ లుక్కేయండి.

Last Updated : Feb 8, 2022, 09:40 PM IST
  • టెక్నో 5జీ స్మార్ట్‌ ఫోన్‌ లాంచ్
  • భారీ బ్యాటరీతో పాటు పెద్ద డిస్‌ప్లేతో వచ్చిన ఫోన్‌
  • 8జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌
  • రూ.19,999లకే 5జీ ఫోన్‌
Tecno Pova 5G Smartphone: వాలెంటైన్స్ డే కానుకగా సూపర్ ఫీచర్స్‌తో కొత్త స్మార్ట్ ఫోన్

Tecno Pova 5G Mobile full Specifications: టెక్నో తన మొదటి 5జీ స్మార్ట్‌ ఫోన్‌ను ఇండియాలో లాంచ్ చేసింది. భారీ బ్యాటరీతో పాటు పెద్ద డిస్‌ప్లేతో వచ్చే ఈ ఫోన్‌ సరసమైన ధరకే లభిస్తోంది. తాజాగా టెక్నో పోవా 5జీ స్మార్ట్‌ ఫోన్‌ లాంచ్‌ అయింది. 

బ్యాక్‌ సైడ్‌ ట్రిపుల్ కెమెరాల సెటప్‌తో... వర్చువల్ విధానంలో ర్యామ్‌ను కెపాసిటీని పొడిగించుకునే ఫీచర్ కూడా ఈ ఫోన్‌లో ఉంది. టెక్నో పోవా 5జీ స్మార్ట్ ఫోన్‌ స్పెసిఫికేషన్స్‌, ఫీచర్స్‌పై, ప్రైస్‌ వివరాలను ఒకసారి చూడండి.

టెక్నో పోవా 5జీ స్మార్ట్‌ ఫోన్ ఒకే వేరియంట్‌లోనే లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో ఫుల్‌ హెచ్‌డీ+ డిస్‌ప్లేతో వస్తుంది. మీడియా టెక్‌ ప్రాసెసర్‌‌తో ఇది రన్ అవుతుంది. 8జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ వచ్చే ఈ మొబైల్‌ ధర రూ.19,999గా ఉంది.

ఏథెర్ బ్ల్యాక్‌ కలర్‌లో ఈ స్మార్ట్‌ ఫోన్ లభిస్తుంది. ఇక ఈ ఫిబ్రవరి 14న అమెజాన్‌లో టెక్నో పోవా 5జీ స్మార్ట్‌ ఫోన్‌ సేల్‌ (Sale) ప్రారంభం కానుంది. కాగా లాంచింగ్‌ ఆఫర్‌‌గా టెక్నో పోవా 5జీ స్మార్ట్‌ ఫోన్‌ కొనుగోలు చేస్తే 1,999 రూపాయల విలువ చేసే పవర్ బ్యాంక్‌ను ఉచితంగా పొందొచ్చు. 

ఇక ఈ ఫోన్ 1080x2460 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.9 ఇంచెస్‌తో ఫుల్ హెచ్‌డీతో వస్తుంది. ఐపీఎస్ ఎల్‌సీడీ డాట్ డిస్‌ప్లే ఉంటుంది. ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.ఇది 8జీబీ ర్యామ్‌తో 128జీబీ స్టోరేజీ వస్తుంది. అయితే ఇంటర్నల్ స్టోరేజీ ద్వారా 3 జీబీ దాకా ఈ మొబైల్‌లో ర్యామ్‌ను పొడిగించుకోవచ్చు. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఇది వర్క్ అవుతుంది. 

ఇక ఈ ఫోన్ బ్యాక్‌ సైడ్‌ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగా పిక్సెల్‌తో మెయిన్‌ కెమెరా ఉంటుంది. 2 మెగా పిక్సెల్‌తో మాక్రో సెన్సార్, అలాగే ఐఏ లెన్స్ ఉంటాయి. నాలుగు ఫ్లాష్‌లైట్స్‌ ఉంటాయి. 16 మెగా పిక్సెల్‌తో ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఈ ఫోన్‌ వస్తుంది. 18 వాట్స్‌ ఫాస్ట్ చార్జింగ్‌కు ఈ మొబైల్‌ (Mobile) సపోర్ట్‌ చేస్తుంది. 

Also Read: Romeo Juliet Full Song: వాలెంటైన్స్ కోసం మరో కొత్త పాట.. రోమియో జూలియెట్ ఫుల్ సాంగ్

Also Read: Hijab controversy: హిజాబ్ వివాదం భయాలు- మూడు రోజులు స్కూళ్లు, కాలేజీలు బంద్​!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News