Visa Free Facility: విదేశాలు వెళ్లాలంటే పాస్‌పోర్ట్ ఒక్కటి ఉంటే సరిపోదు. ఏ దేశం వెళ్లాలనుకుంటున్నారో ఆ దేశం వీసా కూడా అవసరం. ముఖ్యంగా పర్యాటకులకు ఇది కాస్త ఇబ్బందికర వ్యవహారం. సమయానికి వీసా రాకపోతే మొత్తం ప్రయాణం ఆగిపోతుంది. అందుకే పర్యాటకుల్ని పెద్దఎత్తున ఆకర్షించేందుకు, పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు శ్రీలంక కొత్త విదానం ప్రవేశపెట్టింది.
అక్టోబర్ 1 నుంచి శ్రీలంక ఇండియా సహా 35 దేశాల ప్రయాణీకులు, పర్యాటకులకు శుభవార్త అందిస్తోంది. మొత్తం 35 దేశాల ప్రయాణీకులు శ్రీలంక వెళ్లేందుకు వీసా అవసరం లేదు. గతంలో అంటే ఆగస్టు 2న శ్రీలంక సుప్రీంకోర్టు ఇ వీసా నిషేధించింది. ఐవీఎస్ జీబీఎస్, వీఎఫ్ఎస్ గ్లోబల్ ఈ వీసాలు ఆఫర్ చేస్తుంటాయి. ఆ తరువాత భారతీయులకు ఇ వీసా బదులు వీసా ఆన్ ఎరైవల్ అందిస్తూ వచ్చింది. ఇప్పుడిక అక్టోబర్ 1 నుంచి భారతీయులు శ్రీలంకలో వీసా లేకుండానే ఎంటర్ కావచ్చు.
ఫ్రీ వీసా ఎవరెవరికి
ఇండియా, యూకే, యూఎస్ఏ, జర్మనీ, ఆస్ట్రేలియా దేశాలకు వీసా ఫ్రీ సదుపాయం ఉంది. వీటితో పాటు నెదర్లాండ్స్, బెల్జియం, స్పెయిన్, యూఏఈ, నేపాల్, రష్యా, థాయిలాండ్, మలేషియా, జపాన్, ఫ్రాన్స్, కెనడా, ఇటలీ దేశస్థులు కూడా శ్రీలంకకు వీసా లేకుండానే వెళ్లవచ్చు. వీసా ఫ్రీ ట్రావెల్ అంటే ఆ దేశంలో ప్రవేశించేందుకు ముందస్తుగా ఎలాంటి వీసా అవసరం లేదు. దీనివల్ల సమయం ఆదా అవుతుంది. వీసా ఖర్చులు కూడా ఉండవు. కేవలం పాస్‌పోర్ట్ ఉంటే సరిపోతుంది.
2023లో శ్రీలంకకు వచ్చిన పర్యాటకుల్లో 20 శాతం మంది భారతీయులే. ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టిన వీసా ఫ్రీ సౌకర్యంతో భారతీయ పర్యాటకుల సంఖ్య మరింత పెరగనుంది. అక్టోబర్ 2023లో కూడా శ్రీలంక 7 దేశాలకు వీసా సౌకర్యం తొలగించింది. ఇది మే 2024 వరకూ పొడిగించారు. ఈ సమయంలో 2,46,922 మంది పర్యాటకులు శ్రీలంకకు చేరుకోగా, యూకే నుంచి 1,23,992 మంది సందర్శించారు.
శ్రీలంక అందిస్తున్న వీసా ఫ్రీ సౌకర్యం పొందాలంటే వ్యాలిడ్ పాస్‌పోర్ట్, ట్రావెల్ పీరియడ్, రిటర్న్ ట్రావెల్ ప్రూఫ్, ట్రావెల్ సమయంలో ఖర్చులకు కావల్సిన నిధులకు ప్రూఫ్, స్టే ప్రూఫ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, క్రిమినల్ రికార్డ్ చెక్ ఉంటాయి.
Also read: Hair Fall Remedy: జుట్టు రాలడం, వైట్ హెయిర్ సమస్యను నెల రోజుల్లో తగ్గించే ఆయిల్ ఇంట్లోనే తయారీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.