WhatsApp: ప్రముఖ మెసెజింగ్ యాప్ వాట్సాప్ యూజర్లకోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను తీసుకొస్తుంటుంది. ఇందులో భాగంగా తాజాగా ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఇతర మెసేజింగ్ యాప్‌లకు పోటీగా.. ఓ సూపర్ కూల్ ఫీచర్‌ను వాట్సాప్ తీసుకురానుందట.
ఆ కొత్త ఫీచర్ ఏమిటంటే?
వీడియో కాల్స్‌కు సంబంధించి ఈ కొత్త ఫీచర్‌ను తీసుకురానుందట వాట్సాప్. ప్రస్తుతం వాట్సాప్ వీడియో కాల్లో 8 మంది ఒకేసారి మాట్లాడేందుకు వీలుంది. అయితే త్వరలోనే ఈ పరిమితిని 32కు పెంచే దిశగా అడుగులు వేస్తోందట వాట్సాప్. ఈ అప్డేట్ వస్తే జూమ్, సహా వివిధ రకాల వీడియో కాన్ఫరెన్స్ యాప్‌లపై భారీ ఎఫెక్ట్ పడనుందని సమాచారం.
మరిన్ని అప్డేట్స్..
ఫైల్ షేరింగ్ సైజ్‌ను కూడా పెంచనుందట వాట్సాప్. త్వరలోనే 2 గిగాబైట్ల పరిమాణం ఉన్న ఫైళ్లను సైతం వాట్సాప్‌లో షేర్ చేసేందుకు వీలు కలగనుందట. ఇప్పటి వరకు ఇలాంటి ఫీచర్ టెలిగ్రామ్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. దీనితో వాట్సాప్ కూడా ఆ ఫీచర్‌ను తీసుకొచ్చి.. గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తోందని తెలిసింది. ప్రస్తుతం వాట్సాప్‌లో 1 గిగాబైట్ కన్నా తక్కువ సైజ్ ఉన్న ఫైళ్లను మాత్రమే షేర్ చేసుకునేందుకు వీలుంది.
దీనితో పాటు.. గ్రూప్లకోసం ఓ క్రేజీ అప్డేట్ తీసుకురానుందట వాట్సాప్. గ్రూప్‌లలో సభ్యులు పెట్టే మేసేజ్‌లను అడ్మిన్ డిలీట్ చేసేందుకు వీలు కల్పించే విధంగా ఈ ఫీచర్ రానుందని సమాచారం. అయితే ఈ ఫీచర్ ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందని అనే విషయంపై స్పష్టత లేదు.
Also read: Paytm: ప్రధాన మంత్రుల మ్యూజియానికి పేమెంట్స్ భాగస్వామిగా పేటీఎం
Also read: Virtual Reality: రూ.800 ఖర్చుతో ఇంట్లోనే 3D సినిమాలను చూసేయోచ్చు.. అదెలాగో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook