Kakinada Crime News: విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించి.. వారిని సన్మార్గంలో నడిపించాల్సి కొందరు ఉపాధ్యాయులు తప్పుడు పనులకు పాల్పడుతున్నారు. తాజాగా కాకినాడ జిల్లాలో దారుణం వెలుగులోకి వచ్చింది. ఐదో తరగతి చదువుతున్న ఓ చిన్నారిపై హెడ్‌మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. కరప మండలం వాకడ గ్రామంలో ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. రామారావు అనే హెడ్‌మాస్టర్ పాఠశాలకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న వేములవాడలో ఉంటున్నాడు. తరచూ ఆ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని తల్లిదండ్రులు ఆరోపించారు. ఆ బాలికను ఒంటరిగా పిలిచి బట్టలు విప్పి చూడటం.. పిక్నిక్‌కు తీసుకువెళ్లి మిగిలిన విద్యార్థులు పక్కనపెట్టి ఆ బాలికపై అసభ్యంగా ప్రవర్తన చేస్తున్నాడని ఆరోపిస్తున్నారు.
హెడ్‌మాస్టర్ వేధింపులు ఎక్కువ కావడంతో తల్లికి చిన్నారి విషయం మొత్తం చెప్పింది. దీంతో స్థానికులతో కలిసి పాఠశాలకు వెళ్లి.. హెచ్‌ఎం రామారావుకు దేహశుద్ధి చేశారు. అప్పటి నుంచి హెచ్‌ఎం సెలవు పెట్టి.. పాఠశాలకు రావడం లేదని స్థానికులు చెబుతున్నారు. అయితే కొందరు వ్యక్తులు ఈ కేసును రాజీ చేశారని మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. వెంటనే పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి హెడ్‌మాస్టర్‌ను అరెస్ట్ చేసి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read: చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
Also Read: Prakash Raj Kumbha Mela: కుంభమేళాలో ప్రకాష్ రాజ్ పుణ్య స్నానాలు.. స్పందించిన నటుడు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.