ఓమైగాడ్: సల్మాన్ ఖాన్ బీఏ పాసయ్యాడోచ్..!

బాలీవూడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ బీఏ లో పాసయ్యారు. ఈయనే కాదు రాహుల్ గాంధీ, సచిన్ కొడుకు అర్జున్ కూడా పాసయ్యారు.

Last Updated : Nov 24, 2017, 12:22 PM IST
ఓమైగాడ్: సల్మాన్ ఖాన్ బీఏ పాసయ్యాడోచ్..!

మన బాలీవూడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ బీఏ లో పాసయ్యారు. ఆయనకు బీఏ లో 35%  మార్కులు వచ్చాయి. ఆయన 2017వ సంవత్సరంలో పాసైనట్టు ఆగ్రా లోని బీమ్రావ్ అంబేద్కర్ యూనివర్సిటీ అధికారులు మార్క్ షీట్ రెడీ చేశారు. ఈయనే కాదు రాహుల్ గాంధీ, సచిన్ కొడుకు అర్జున్ కూడా ఇదే యూనివర్సిటీ విద్యార్థులేనట. మీరే కాదు ఈ విషయం తెలిసిన యూనివర్సిటీ అధికారులు కూడా అవాక్కయ్యారు. 

వివరాల్లోకి వెళితే.. ఆలీఘడ్ లోని తేజ్ పూర్ అమృతా సింగ్ మెమోరియల్ డిగ్రీ కళాశాల చదివే ఒక బీఏ ఫస్ట్ ఇయర్ విద్యార్థికి బీమ్రావ్ అంబేద్కర్ యూనివర్సిటీ మార్కుల మెమో జారీ చేసింది. ఆ మార్క్ షీట్ లో సదరు విద్యార్థి ఫొటో కాక హీరో సల్మాన్ ఖాన్ ఫోటో ముద్రితమైంది.  యూనివర్సిటీ బీఏ ఫస్ట్ ఇయర్ మర్క్స్ మెమో రూపొందించే భాధ్యతను ఒక ప్రవేట్ సంస్థకు అప్పగించింది. ఈ నేపథ్యంలోనే పొరపాటు దొర్లినట్లు గుర్తించిన యూనివర్సిటీ అధికారులు వెంటనే ఆ తప్పును సరిదిద్దుకొని ఆ విద్యార్థికి మార్క్స్ మెమో జారీ చేశారు. అప్పటికే సోషల్ మీడియాలో 'సల్మాన్ మర్క్స్ మెమో' గా వైరల్ అయ్యింది ఈ సర్టిఫికెట్. యూనివర్సిటీ అధికారులు ప్రవేట్ సంస్థ నిర్లక్ష్యంపై మండిపడ్డారు.  గతంలో రాహుల్ గాంధీ, సచిన్ కొడుకు ఫొటోలతో కూడిన సర్టిఫికెట్లను జారీ చేశారు ఈ యూనివర్సిటీ అధికారులు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ యూనివర్సిటీ స్నాత్నకోత్సవానికి హాజరవుతున్న వేళ ఇలాంటి తప్పులు దొర్లడం చర్చనీయాంశంగా మారింది. 

 

Trending News