ప్రభుదేవా డైరెక్షన్‌లో అమితాబ్ డ్యాన్స్

      

Last Updated : Oct 29, 2017, 03:16 PM IST
ప్రభుదేవా డైరెక్షన్‌లో అమితాబ్ డ్యాన్స్

75 ఏళ్ళ వయసులో కూడా బిగ్ బి అమితాబ్ బచ్చన్ డ్యాన్స్ చేయబోతున్నారు.. అది కూడా ప్రభుదేవా డైరెక్షన్‌లో అంటే ఇక ఫ్యాన్స్‌కు పండగే.. కానీ అమితాబ్ ఇదే విషయంపై ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.."75 సంవత్సరాల వయసులో నాతో డ్యాన్స్ చేయిస్తారా..బాగుంది. అది మెచ్చుకోదగ్గ పరిణామమే.. అది కూడా జీనియస్ లాంటి ప్రభుదేవా దర్శకత్వంలో అంటున్నారు.. కానీ మెంటల్ ఆసుపత్రిలో కాక ఇంటిలో ఉన్నందుకు సంతోషించండి" అని సరదాగా ట్వీట్ చేశారట అమితాబ్. ప్రస్తుతం అమితాబ్ థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ మరియు 102 నాట్ అవుట్ చిత్రాల్లో నటిస్తున్నారు. మరి ప్రభుదేవాతో కలసి పనిచేస్తున్న సినిమా వివరాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. ఈ మధ్యకాలంలోనే అమితాబ్ బచ్చన్ పుట్టినరోజు వేడుకలను "కౌన్ బనేగా కరోడ్‌పతి సెట్స్"లో ఆయనకు చెప్పకుండా జరిపి ఆయనను ఆశ్చర్యచకితుల్ని చేశారు నిర్వాహకులు. ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని, ఒక స్పెషల్ వీడియా కూడా టెలికాస్ట్ చేశారు. అయితే అనుకోని ఆ సంఘటనలకు బాగా భావోద్వేగానికి లోనయ్యారు బిగ్ బి. 

 

Trending News